Srinivasa Rao: మాపై చంద్రబాబు అసత్య ఆరోపణలు.. లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు
ABN , First Publish Date - 2023-08-10T20:53:32+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమపై అసత్య ఆరోపణలు చేశారని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AP Police Officers Association) అధ్యక్షుడు శ్రీనివాస రావు (Srinivasa Rao) అన్నారు.

కర్నూలు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమపై అసత్య ఆరోపణలు చేశారని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AP Police Officers Association) అధ్యక్షుడు శ్రీనివాస రావు (Srinivasa Rao) అన్నారు.
"నారా లోకేష్ పోలీస్ అధికారులను రెడ్ బుక్‌లో నోట్ చేస్తున్నా అని బెదిరిస్తున్నారు. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల దాడులు జరిగాయి. మా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు కంటి చూపు కోల్పోయారు. దాడి తరువాత మీరు కానీ, మీ నాయకులు కనీసం స్పందించకపోవడం బాధాకరం. మీరు సీఎంగా ఉన్నపుడు పనిచేశాను. లా అండ్ ఆర్డర్ బాగుంటే పాలన బాగుంటుంది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు హత్య ప్రయత్నం చేశారని వ్యాఖ్యలు చేశారు. మీరు ఏ ఒక్క పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేశారా అని అడుగుతున్నాం. సీఎం, డీజీపీ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి." శ్రీనివాసరావు స్పష్టం చేశారు.