Visakha: టీటీడీలో అన్యమతస్తులను తొలగించాలి: బీజేపీ

ABN , First Publish Date - 2023-08-30T11:16:48+05:30 IST

విశాఖ: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలిలో ఉన్న అన్యమతస్తులు, దోపిడీదారులను తొలగించాలని కోరుతూ బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. విశాఖ, హనుమంతవాక భక్తతుకారమ్ ఆలయంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతోంది.

Visakha: టీటీడీలో అన్యమతస్తులను తొలగించాలి: బీజేపీ

విశాఖ: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలిలో ఉన్న అన్యమతస్థులు (Pagans), దోపిడీదారులను (Robbers) తొలగించాలని కోరుతూ బీజేపీ (BJP) సంతకాల సేకరణ చేపట్టింది. విశాఖ, హనుమంతవాక భక్తతుకారమ్ ఆలయంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ (Ex MLC Madhav) ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతోంది. ఈ సందర్బంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ... ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆలయాల్లో పవిత్రతకు భంగం కలుగుతోందన్నారు. బోర్డు సభ్యులుగా నామినేట్ అవ్వాలంటే ఎన్‌వోసీ వచ్చాకే తీసుకునేవారని.. ఇప్పుడది లేదని అన్నారు.

వైసీపీ (YCP)కి డబ్బులిచ్చే వారికి, కావాల్సిన వారికి బోర్డు సభ్యుల పదవి కట్టబెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) నాస్తిక వాదంతో వున్న వ్యక్తిఅని, టీటీడీ ఛైర్మన్‌గా గతంలోనే ఆయనను వ్యతిరేకించామన్నారు. కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి కళంకితులని, వారికి టీటీడీ బోర్డు (TTD Board)లో ఎలా పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. అనేక మందిని డైరెక్ట్‌గా నామినేట్ చేయడంలోనే కుట్ర వుందన్నారు. దేవాలయాల్లో సూడో క్రిస్టియన్లు వున్నారని, వారికి వైసీపీ మద్దతు వుందని, దేవాలయ వ్యవస్ధను కాపాడుకునేందుకు ప్రతి హిందువు ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పిలుపిచ్చారు.

Updated Date - 2023-08-30T11:16:48+05:30 IST