Yanamala Ramakrishna: దోచుకోవడమే జగన్ సర్కార్ లక్ష్యం

ABN , First Publish Date - 2023-06-30T14:55:04+05:30 IST

సహజవనరులను దోచుకోవడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. విశాఖలో యనమల మాట్లాడారు. ‘‘విశాఖలో రెండు రకాలైన సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయి. ఒకటి శాంతియుత జీవనానికి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యేవారు కొందరు. రెండో వారు ఇక్కడ ప్రజలను దోచుకోడానికి ప్రజలను భయపెట్టి లాక్కోవడానికి జరిగే సెటిల్‌మెంట్ చేసేవారు మరికొందరు.

Yanamala Ramakrishna: దోచుకోవడమే జగన్ సర్కార్ లక్ష్యం

విశాఖ: సహజవనరులను దోచుకోవడమే సీఎం జగన్ (CM JAGAN) పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) ఆరోపించారు. విశాఖలో యనమల మాట్లాడారు. ‘‘విశాఖలో రెండు రకాలైన సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయి. ఒకటి శాంతియుత జీవనానికి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యేవారు కొందరు. రెండో వారు ఇక్కడ ప్రజలను దోచుకోడానికి ప్రజలను భయపెట్టి లాక్కోవడానికి జరిగే సెటిల్‌మెంట్ చేసేవారు మరికొందరు. రెండో కోవకు చెందిన వారు జగన్, అతని అనుయాయులు. జగన్ దిగిపోయే నాటికి ఏపీలో 11 లక్షల కోట్లు అప్పులు పేరుకుపోయే అవకాశం ఉంది. ప్రజల నుంచి దోచుకున్న మొత్తాన్ని ఇడుపులపాయ దగ్గర జగన్ దాచుకుంటున్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు దోచుకున్న సంపదను తిరిగి రికవరీ చేసుకుని తీరుతాం. సంక్షేమం, అభివృద్ధి టీడీపీకి రెండు కళ్లు. ప్రజలపై పడిన అప్పుల భారాన్నితొలగించడమే కాదు.. పొదుపు చేసుకునే స్థాయికి తీసుకొస్తాం. జగన్ స్కాలర్ షిప్పులు తొలగించి ఆ మొత్తాన్నే అమ్మ ఒడిగా ఇస్తున్నారు. అన్ని అరాచకాలకు అడ్డుకట్ట పడాలంటే చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి కావాలి.’’ అని యనమల ఆకాంక్షించారు

Updated Date - 2023-06-30T14:55:04+05:30 IST