Fixed Deposits: అధిక వడ్డీతో 3 బ్యాంకులు అందిస్తున్న .. 3 ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!
ABN , First Publish Date - 2023-12-13T10:42:56+05:30 IST
3 FDs with higher interest rates: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు, సాధారణ పౌరులకు వివిధ సందర్భాలలో అధిక వడ్డీ వచ్చే కొన్ని ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తుంటాయి. ఇలా ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్ మూడు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి.
3 FDs with higher interest rates: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు, సాధారణ పౌరులకు వివిధ సందర్భాలలో అధిక వడ్డీ వచ్చే కొన్ని ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తుంటాయి. ఇలా ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్ మూడు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ మూడు బ్యాంకులు అందిస్తున్న ఈ స్పెషల్ పథకాల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. సో.. ఈ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్‌లో చేరాలనుకునేవారికి డిసెంబర్ 31వ తారీఖు ఆఖరు అవకాశం. ఇక ఆ మూడు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్‌ల విషయానికి వస్తే.. 1. ఎస్‌బీ అమృత్ కలశ్ ఎఫ్‌డీ స్కీమ్, 2. ఐడీబీఐ ఉత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్, 3. ఇండియన్ బ్యాంక్ ఇండ్ సూపర్ ఎఫ్‌డీ స్కీమ్.
1. ఎస్‌బీ 'అమృత్ కలశ్' ఎఫ్‌డీ స్కీమ్
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం అధిక వడ్డీ వచ్చే స్పెషల్ ఫిక్సడ్ డిపాజిట్ స్కీమ్ 'అమృత్ కలశ్'ను తీసుకువచ్చింది. మీ చేతిలో కొంత డబ్బు ఉండి, తక్కువ సమయంలో మంచి ఆదాయం సంపాదించాలనే ప్లాన్ ఉంటే మాత్రం మీకు ఈ స్కీమ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం టైమ్ పిరియడ్‌ను 400 రోజులుగా ఫిక్స్ చేసింది. ఈ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 7.6శాతం వడ్డీ రేటు ఉటుంది. అలాగే సాధారణ పౌరులకైతే 7.1శాతం వడ్డీ ఇస్తుంది బ్యాంక్. ఇక ఎస్‌బీఐ ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా ఒక శాతం (1%) వడ్డీ ఆఫర్ ఉంది.
2. ఐడీబీఐ 'ఉత్సవ్' ఎఫ్‌డీ స్కీమ్
ఐడీబీఐ (IDBI) బ్యాంక్ ఫెస్టివ్ ఆఫర్‌లో భాగంగా 'ఉత్సవ్ ఫిక్సడ్ డిపాజిట్' పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్ రెండు కాలవ్యవధిలలో అందుబాటులో ఉంది. 375, 444రోజులతో ఐడీబీఐ ఈ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌ను అందిస్తోంది. 375 రోజుల ఉత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా సాధారణ పౌరులు, ఎన్నారైలకు 7.10 శాతం వడ్డీని ఇస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ వస్తుంది. ఇక 444 రోజుల ఉత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా సాధారణ పౌరులు, ఎన్నారై, ఎన్నాఆర్ఓలకు 7.25 శాతం వడ్డీని ఇస్తే.. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని ఇస్తోంది ఐడీబీఐ బ్యాంక్.
3. ఇండియన్ బ్యాంక్ 'ఇండ్ సూపర్' ఎఫ్‌డీ స్కీమ్
ఇండియన్ బ్యాంక్ (Indian Bank) 'ఇండ్ సూపర్ 400 డేస్' పేరుతో స్పెషల్ ఎఫ్‌డీ పథకాన్ని అందిస్తోంది. 400 రోజుల కాలవ్యవధితో వచ్చే ఈ పథకంలో కనిష్టంగా 10వేల రూపాయల నుంచి గరిష్టంగా 2కోట్ల వరకు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇక ఈ పథకంలో చేరిన సాధారణ పౌరులకు బ్యాంక్ 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అలాగే సూపర్ సీనియర్లకైతే ఏకంగా 8 శాతం వడ్దీ ఇస్తామని ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.