Airport: సాఫ్ట్‌వేర్ జాబ్‌కు గుడ్ బై చెప్పి.. విమానాశ్రయాల్లో భిక్షాటన.. రోజుకు ఎంత సంపాదించేవాడో తెలిసి అవాక్కైన అధికారులు..!

ABN , First Publish Date - 2023-05-22T18:09:16+05:30 IST

చదువు సంస్కారం నేర్పిస్తుంది అంటారు. విద్యావంతులు సంస్కారవంతులకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగిన విధంగా జీవించాల్సి ఉంటుంది. లేదంటే పరువుపోతుంది. ఇక సిరి విషయానికి వస్తే..

Airport: సాఫ్ట్‌వేర్ జాబ్‌కు గుడ్ బై చెప్పి.. విమానాశ్రయాల్లో భిక్షాటన.. రోజుకు ఎంత సంపాదించేవాడో తెలిసి అవాక్కైన అధికారులు..!
airports

చదువు సంస్కారం నేర్పిస్తుంది అంటారు. విద్యావంతులు సంస్కారవంతులకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగిన విధంగా జీవించాల్సి ఉంటుంది. లేదంటే పరువుపోతుంది. ఇక సిరి విషయానికి వస్తే.. వస్తుంటుంది.. పోతుంటుంది. కానీ దాని కోసం అడ్డదారులు తొక్కితే జీవితం నాశనం అవుతుంది. ఇదంతా ఎదుకంటారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

కొంత మంది ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. కానీ ఏదొక రోజు పాపం పండి జైల్లో ఊసలు లెక్కట్టాల్సి వస్తుంది. చాలా మంది అడ్డదారుల్లో సంపాదించడానికి ఎత్తుగడలు వేస్తుంటారు. పోలీసులకు దొరక్కుండా ప్రణాళికలు వేస్తుంటారు. కానీ ఏదొక రోజు దొరికిపోతామన్న సంగతి మరిచిపోతారు. అలాంటి సంఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది.

ఏ ఆధారం లేనివాళ్లు రోడ్లపై, ప్రార్థనా స్థలాల దగ్గర భిక్షాటన చేస్తుంటారు. ఇది వారు చేస్తే బాగానే ఉంటుంది. కానీ అన్ని బాగుండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్లు కూడా దీన్నే దందాగా మార్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సులువుగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేశాడు ఆ యువకుడు. ఏకంగా ఎయిర్‌పోర్టులనే లక్ష్యంగా చేసుకున్నాడు. విదేశీయుల లక్ష్యంగా డబ్బు సంపాదించేందుకు బిచ్చగాడి అవతారమెత్తాడు. ఇలా నాలుగేళ్లుగా శంషాబాద్ సహా పలు విమానాశ్రాయాల్లో (Airport) యాచిస్తూ (begging) మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా భారీగా నగదు సంపాదించాడు. ఎట్టకేలకు పాపం పండి పట్టుబడ్డాడు.

చెన్నైకు చెందిన విఘ్నేష్‌ బీటెక్‌ పూర్తి చేసి కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉగ్యోగం చేశాడు. నాలుగంకెల జీతం. ఓ సారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్‌ పర్సు పోగొట్టుకున్నాడు. విమాన టికెట్‌ ఫోన్‌లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితి తలెత్తింది. దీంతో బెంగళూరు లాంజ్‌లో ఓ విదేశీయుడితో తన సమస్యను చెప్పుకున్నాడు. జాలిపడ్డ విదేశీయుడు వెంటనే రూ. 10 వేలు ఇచ్చాడు. ఇక కోవిడ్ కారణంగా అతని ఉద్యోగం కోల్పోవడంతో అతడి ఆలోచన మారిపోయింది. బెంగళూరు ఎయిర్‌పోర్టు అనుభవంతో ఈజీ మనీపై దృష్టిపెట్టాడు.

ప్రయాణికులకు వివిధ పేర్లతో టోకరా వేసి డబ్బు దండుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం విఘ్నేష్‌ నిర్ణీత సమయానికి ముందే తక్కువ ధరకు వచ్చేలా డొమెస్టిక్‌ విమాన టికెట్లు బుక్‌ చేసుకొనేవాడు. ఖరీదైన దుస్తులు ధరించి.. చేతిలో లగేజ్‌ బ్యాగ్‌తో ఎవరికీ అనుమానం రాకుండా ఫ్లైట్‌ షెడ్యూల్‌ టైమ్‌కు దాదాపు కొన్ని గంటల ముందే ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించేవాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్యాసింజర్‌ను ఎంచుకుని మాటలు కలిపేవాడు. ఆపై ఫోన్‌ మాట్లాడినట్లు నటించేవాడు. అనంతరం తన తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైనట్లు నటిస్తూ కుటుంబ సభ్యులు చెప్పారని... వెంటనే శస్త్రచికిత్స చేయించేందుకు తన వద్ద డబ్బు లేదని ప్యాసింజర్‌కు చెప్పి సాయం కోరేవాడు. దీంతో ఆ ప్యాసింజర్‌ జాలిపడి వీలైనంత సొమ్ము ఇచ్చేవాడు. ఆ తర్వాత విమానం ఎక్కి మరో నగరంలో దిగి అక్కడ కూడా ఇదే పంథాలో దండుకొనేవాడు. ఇలా విఘ్నేష్‌ ఒక్కోరోజు రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించేవాడు. నిర్ణీత మొత్తం సంపాదించాకే చెన్నైలోని ఇంటికి తిరిగెళ్లేవాడు. ఆ డబ్బు ఖర్చయ్యే వరకు జల్సాలు చేసేవాడు.

ఇలా విఘ్నేష్‌.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సహా ఎనిమిది నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తన జేబు నింపుకున్నాడు. అత్యధికులు విదేశీయులే మోసపోవడంతో ఎవరికీ విషయం తెలియలేదు. ఈ కారణంగానే 2021 నుంచి విఘ్నేష్‌ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ నెల 11న బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో ఇద్దరికి టోకరా వేసి మూడో వ్యక్తి దగ్గరకు విఘ్నేష్‌ వెళ్లడాన్ని గమనించిన ఓ అధికారి అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు బండారం బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు విఘ్నేష్‌ను పోలీసులకు (police) అప్పగించారు. ఆయా రాష్ట్రాల్లో విఘ్నేష్ జరిగించిన మోసాలను పోలీసులు వెలికి తీస్తున్నారు.

ఇది కూడా చదవండి: Crime News: 16 ఏళ్ల బాలిక అతి తెలివి మామూలుగా లేదుగా.. ఒక్క మెసేజ్‌తో కోటి రూపాయలు సంపాదించాలనుకుంది.. కానీ..!

ఇది కూడా చదవండి: Viral News: మాజీ ప్రియుడి నుంచి మూడేళ్ల తర్వాత వచ్చిందో మెసేజ్.. అంతా చదివిన ఆ ప్రేయసికి మైండ్‌బ్లాక్.. అతడేం అడిగాడంటే..!

Updated Date - 2023-05-22T18:09:16+05:30 IST