Air India : లండన్-ముంబై విమానం టాయ్‌లెట్‌లో ఆ పని చేసిన ప్రయాణికుడిపై కేసు
ABN , First Publish Date - 2023-03-12T14:20:11+05:30 IST
ప్రవర్తన సక్రమంగా లేని, దురుసుతనంతో కూడిన విమాన ప్రయాణికుల గురించి వార్తలు తరచూ వస్తున్నాయి. ఓ మహిళపైన తాగిన మైకంలో
ముంబై : ప్రవర్తన సక్రమంగా లేని, దురుసుతనంతో కూడిన విమాన ప్రయాణికుల గురించి వార్తలు తరచూ వస్తున్నాయి. ఓ మహిళపైన తాగిన మైకంలో మూత్ర విసర్జన చేయడం వంటి సంఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ అమెరికన్ పౌరుడు లండన్-ముంబై ఎయిరిండియా విమానంలోని టాయ్‌లెట్‌లో ధూమపానం చేయడంతోపాటు, సహ ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది.
ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విమానం సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు ఏమిటంటే, అమెరికన్ పౌరుడు రమాకాంత్ (Ramakanth) (37) మార్చి 10న లండన్-ముంబై ఎయిరిండియా విమానం (London-Mumbai Air India flight) బాత్రూమ్‌లో ధూమపానం (Smoking) చేశారు. ఆయన తన తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించారు. విమానం తలుపును తెరిచేందుకు కూడా ప్రయత్నించారు. తన బ్యాగ్‌లో మెడిసిన్ ఉందని ఆయన చెప్పడంతో, ఆ బ్యాగ్‌ను తనిఖీ చేశారు, కానీ అందులో అటువంటిదేమీ కనిపించలేదు. నిందితుడు తాగిన మైకంలో ఉన్నారా? మానసిక అస్వస్థతతో బాధపడుతున్నారా? అనే అంశాన్ని తెలుసుకునేందుకు ఆయన నమూనాల (Samples)ను పరీక్షల కోసం పంపించారు.
ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 10న లండన్ నుంచి ముంబై వెళ్తున్న ఏఐ130 విమానంలో ఓ ప్రయాణికుడు టాయ్‌లెట్‌లో ధూమపానం చేస్తూ పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆయన దురుసుగా, దూకుడుగా ప్రవర్తించారు. పదే పదే హెచ్చరించినప్పటికీ ఆయన ప్రవర్తన మారలేదు. విమానం ముంబై చేరుకున్న తర్వాత ఆయనను భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ సంఘటన గురించి నియంత్రణ సంస్థకు సమాచారం ఇచ్చారు.
దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని, విమాన సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించే ప్రవర్తనను తాము సహించబోమని ఎయిరిండియా ప్రకటన తెలిపింది.
ముంబై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ, రమాకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇతరుల భద్రత, ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా దురుసుగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం తదితర ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Delhi liquor scam case : జైల్లో పెట్టి నా ధైర్యాన్ని దెబ్బతీయలేరు: మనీశ్
Congress Vs BJP : రాహుల్ గాంధీని దేశం నుంచి వెళ్లగొట్టాలి : ప్రజ్ఞ ఠాకూర్