Share News

Opposition Leaders: కేంద్రం మా ఫోన్‌లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.. ప్రతిపక్షాల ఆరోపణలు

ABN , First Publish Date - 2023-10-31T14:05:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తమ ఐ ఫోన్‌లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నం చేస్తోందని పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి తమకు అలర్ట్ మెసేజ్‌లు కూడా వచ్చాయని వారు చెబుతున్నారు. అంతేకాకుండు తమకు వచ్చిన మిసేజ్‌లను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Opposition Leaders: కేంద్రం మా ఫోన్‌లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.. ప్రతిపక్షాల ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వం తమ ఐ ఫోన్‌లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నం చేస్తోందని పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి తమకు అలర్ట్ మెసేజ్‌లు కూడా వచ్చాయని వారు చెబుతున్నారు. అంతేకాకుండు తమకు వచ్చిన మిసేజ్‌లను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మెసేజ్‌లు అందుకున్న వారిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శశి థరూర్, శివసేనకు చెందిన ప్రియాం చతుర్వేది, ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఒవైసీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌కు చెందిన పవన్ ఖేరా ఉన్నారు. వీరంతా తమ ఐ ఫోన్‌లకు వచ్చిన అలర్ట్ మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. ప్రభుత్వం అధ్వర్యంలో పని చేసే హ్యాకర్లు మీ ఐ ఫోన్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారంతోపాటు, కమ్యూనికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్‌లను వారు యాక్సెస్ చేసే అవకాశం ఉందనేది ఆ మెసేజ్ సారాంశంగా ఉంది. ఈ మెసేజ్ వచ్చిన వారిలో ఒకరైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎక్స్‌లో స్క్రీన్ షాట్ షేర్ చేయడంతోపాటు ఓ ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్‌లో ఇండియా కూటమికి చెందిన నేతల ఫోన్లను హ్యాక్ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందిన ఆరోపించారు. తనతోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా, అలాగే సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌కు చెందిన పవన్ ఖేరాకు కూడా అలర్ట్ మెసేజ్‌లు వచ్చినట్టు పేర్కొన్నారు.


కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా తనకు యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్‌లు వచ్చినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తనలాంటి పన్ను చెల్లింపుదారుల వద్ద నిరుపేద అధికారులను బిజీగా ఉంచడం ఆనందంగా ఉందని, అంతకంటే ముఖ్యమైనది ఏమీ లేదని ట్వీట్ చేశారు. ఇతర ఎంపీల మాదిరిగానే థరూర్ కూడా హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయాలను ట్యాగ్ చేశారు. ఆరోపించిన హ్యాకింగ్ బిడ్‌పై విచారణకు పిలుపునిచ్చారు. మరో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తన ఫోన్‌కు వచ్చిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. "డియర్ మోదీ సర్కార్. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?" అని రాసుకొచ్చారు. ఈ హ్యాకింగ్ దేశ ప్రజలపై దాడి అని ఆప్ రాజ్యసభ ఎంపీ చద్దా సుదీర్ఘమైన నోటును పోస్ట్ చేశారు. "ప్రతి భారతీయుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు నేను, రేపు అది మీరు కావచ్చు" అని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నాయకుల ఆరోపణలపై బీజేపీ ఐటీ సెల్ బాస్ అమిత్ మాల్వియా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తమ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తూ, పలువురు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. యాపిల్ నుంచి స్పష్టత వచ్చేవరకు వారు ఎందుకు వేచి చూడలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2023-10-31T14:05:30+05:30 IST