Price of movie tickets: సినిమా టిక్కెట్ల ధరల పెంపు.. జీవో విడుదల చేసిన సర్కారు
ABN , First Publish Date - 2023-11-10T11:11:48+05:30 IST
తమ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ పుదుచ్చేరి ప్రభుత్వం(Puducherry Govt) బుధవారం రాత్రి జీవో విడుదల
పుదుచ్చేరి: తమ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ పుదుచ్చేరి ప్రభుత్వం(Puducherry Govt) బుధవారం రాత్రి జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఫస్ట్‌క్లాస్ టిక్కెట్‌పై రూ.30 మేర పెంచింది. ఈ విషయంపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా పెంచిన ధరల ప్రకారం.. ఇప్పటివరకు సినిమా థియేటర్లలో రూ.150 విక్రయించే బాల్కనీ టిక్కెట్ ధర రూ. 170కు పెంచారు. రూ.100 ఫస్ట్‌క్లాస్ టిక్కెట్ ధర రూ.130గాను, సెకండ్ క్లాస్ టిక్కెట్ ధర రూ.70 నుంచి రూ.100, థర్డ్ క్లాస్ టిక్కెట్ ధర రూ.50 నుంచి రూ.60కి పెంచారు. థియేటర్లలో బాక్స్ టిక్కెట్ ధరను రూ.160 నుంచి రూ.180కు పెంచారు. మాల్స్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఎలైట్, బాల్కనీ, డీలక్స్ ధరను రూ.170గా, ప్రీమియం టిక్కెట్ ధరను రూ.130గా చేశారు.