Special trains: నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు
ABN , First Publish Date - 2023-05-20T08:51:20+05:30 IST
కాచిగూడ-నాగర్‌కోయిల్ మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం.07435 కాచిగూడ -నాగర్‌కోయిల్(Kachiguda - Nagercoil)
పెరంబూర్, మే 19: కాచిగూడ-నాగర్‌కోయిల్ మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం.07435 కాచిగూడ -నాగర్‌కోయిల్(Kachiguda - Nagercoil) ప్రత్యేక ఛార్జీ రైలు ఈ నెల 26, జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 7.45 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 10.30 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. అలాగే, నెం.07436 నాగర్‌కోయిల్ - కాచిగూడ ప్రత్యేక ఛార్జీ రైలు ఈ నెల 28, జూన్4, 11, 18, 25, జూలై 2వ తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు నాగర్‌కోయిల్‌లో బయల్దేరి రెండవ రోజు ఉదయం 6.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైళ్లు మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు(Sattenapalli, Guntur, Tenali, Bapatla, Ongole, Nellore), గూడూరు, రేణిగుంట, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, విరుదాచలం, శ్రీరంగం, తిరుచ్చి, దిండుగల్, మదురై, విరుదునగర్, సాతూర్, కోవిల్‌పట్టి, తిరునల్వేలి స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ రైల్వే తెలియజేసింది.