Modi Vs Mamata : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన దీదీ.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2023-03-30T11:19:49+05:30 IST
పశ్చిమ బెంగాల్ కు రావలసిన నిధులను విడుదల చేయడం లేదంటూ ధర్నా చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ (West Bengal)కు రావలసిన నిధులను విడుదల చేయడం లేదంటూ ధర్నా చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ (TMC) అధినేత్రి మమత బెనర్జీ (CM Mamata Banerjee) తన నిరసనను ఓ పాట రూపంలో వ్యక్తం చేశారు. బెంగాలీలో రాసిన ఈ పాటను టీఎంసీ నేతలతో కలిసి ఆమె పాడారు. బుధవారం ప్రారంభమైన ఈ ధర్నా గురువారం కూడా కొనసాగుతోంది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం సహా అనేక పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ, వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధ, గురువారాల్లో కోల్‌కతాలో మమత ధర్నా చేస్తున్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ, బీజేపీతో ముఖాముఖి పోరాడాలన్నారు. ఇది కుర్చీ కోసం జరిగే పోరాటం కాదన్నారు. ఇది దేశం కోసం పోరాటమన్నారు. ఇది బీజేపీకి, ప్రజలకు మధ్య పోరాటంగా ఉండాలని తెలిపారు. బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాలన్నారు. బీజేపీ హింసించని పార్టీ ఏదీ లేదని, అందుకే అన్ని ప్రతిపక్ష పార్టీలను తాను కోరుతున్నానని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Prime Minister Narendra Modi : రాముడి జీవితం మానవాళికి స్ఫూర్తి...మోదీ రామనవమి శుభాకాంక్షలు
Lalit Modi Vs Rahul Gandhi : రాహుల్ గాంధీకి లలిత్ మోదీ హెచ్చరిక