NRI: కువైత్‌లో విజయవంతంగా తెలుగు కళా సమితి వినాయక చతుర్థి

ABN , First Publish Date - 2023-10-05T09:04:20+05:30 IST

ఎడారి దేశాలలో ప్రపథమ ప్రవాసీ తెలుగు సంఘమైన కువైత్‌లోని తెలుగు కళా సమితి గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఇటీవల తాండవ నృత్య కరీ గజానన కూచిపూడి నృత్యాలు, చిన్నారుల ప్రార్ధన గీతాలు, తెలుగు కవి వ్యంగ్యానుకరణల మేళవింపుతో వైభవంగా నిర్వహించింది.

NRI: కువైత్‌లో విజయవంతంగా తెలుగు కళా సమితి వినాయక చతుర్థి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఎడారి దేశాలలో ప్రపథమ ప్రవాసీ తెలుగు సంఘమైన కువైత్‌లోని తెలుగు కళా సమితి గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఇటీవల తాండవ నృత్య కరీ గజానన కూచిపూడి నృత్యాలు, చిన్నారుల ప్రార్ధన గీతాలు, తెలుగు కవి వ్యంగ్యానుకరణల మేళవింపుతో వైభవంగా నిర్వహించింది. భారత రాయబారి ఆదర్శ్ స్వైకా, తెలుగు సినిమా రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుల జ్యోతి ప్రజ్వలన అనంతరం కువైత్, భారత దేశాల జాతీయ గీతాల ఆలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముద్దా సుబ్బారావు సభ్యులందరికి స్వాగతం పలికారు. పార్థసారథి మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి పూర్వ కమిటీలకు, వారికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వినూత్నమైన ఈ సంవత్సర కార్యక్రమాలన్నీ అందరిని అలరిస్తాయని అన్నారు.

భారత రాయబారి స్వైకా మాట్లాడుతూ తెలుగు కళా సమితి తన పరిధిని పెంచుకుంటూ భారీ ప్రదర్శన కార్యక్రమాలు చేయగలగడం, అలాగే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినిమా రచయిత, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుకు భారత రాయబారి స్వైకా చేతుల మీదుగా సన్మానం జరిగింది. సభికులను విశేషంగా ఆకర్షించిన అంశాలలో 2023-24 కార్యవర్గ పరిచయం, 35 సం.ల తెలుగు కళా సమితి ఘన చరిత్ర చిత్రమాలిక, పూర్వాధ్యక్షుల సందేశాల చిత్రమాలిక, తెలుగు కళా సమితి మొబైల్ యాప్ ఆవిష్కరణ, గణేశ మందిరం ఉన్నాయి. తెలుగు కళా సమితి సభ్యుల చిన్నారులు ఆలపించిన "హర హర శంభో" పాట వన్స్ మోర్ ప్రదర్శనగా నిలిచింది.

ఉపాసన బృందం నిర్వహించిన రామయాణ శబ్దంతో పాటు ఇతర నృత్యాలు, శివాందవి నృత్యాయం ప్రదర్శించిన రతి చిత్ర, సైమోన్త్ర నిర్వహించిన శ్రీ గణేశా నృత్యం, ఇతర శాస్త్రీయ నృత్యాలు సభికులను ఎంతగానో అలరించాయి. తెలుగు కళా సమతి చరిత్రలో మొట్ట మొదటిసారిగా 35 సంవత్సరాల విశేషాలను సంక్షిప్త పరిచి చిత్ర మాలికగా ప్రదర్శించడం జరిగింది. అలాగే కమిటీ పూర్వాధ్యక్షులు తమ సందేశాన్ని చిత్ర మాలికగా సభ్యులకు అందించడం ద్వారా ఈ కమిటీ చేసిన నూతన ప్రయత్నం సభ్యులందరి ప్రశంసలు అందుకుంది.

సమితి ఉపాధ్యక్షులు కృష్ణమ రాజు TKS మొబైల్ ఆప్ (బీటా వెర్షన్) విడుదల చేయడం జరిగింది. కమిటీ సభ్యులు నాగార్జున రెడ్డి మొబైల్ యాప్ ఫీచర్స్, ఉపయోగాలు వివరించారు. తెలుగు సినిమా రచయిత, కవి,పేరడీలకు పేరెన్నికగన్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తన పేరడీ గానాలతో ప్రేక్షకులని ఉత్సాహపరిచారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ భారతీయ సంప్రదాయం, సంస్కృతులను కొనసాగించడంలో తెలుగు కళా సమితి ముందుందన్నారు. అలాగే సభ్యులందరూ తెలుగుకి ఇచ్చే ప్రాధాన్యత తనకు అమితమైన సంతోషాన్ని ఇచ్చిందన్నారు .

గణేశా పాటలపై శాస్త్రీయ నృత్య ప్రదర్శన చేసిన హరిణి వర్మ తన నృత్యంతో సభికులను ముగ్ధులను చేసింది. తనిష్క దేవత "అలరింపు" భరత నాట్యాన్నీ ప్రదర్శించారు. ప్రార్ధన గీతాల అబ్యాసనకు సహకరించిన చిన్నారుల తల్లి తండ్రులందరికి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. పల్లకి సేవకు ముందు శ్రీజ చేసిన నృత్యం ప్రేక్షకులందరినీ అలరించింది. అనంతరం జరిగిన వినాయక ప్రసాదం 10 కిలోల లడ్డు వేలం ఆద్యంతం కేరింతలతో హుషారుగా సాగింది. 10 కిలోల లడ్డు ప్రసాదాన్ని ఎంతో భక్తి పూర్వకంగా తయారుచేసిన శేఖర్ రాజు దంపతులకు తెలుగు కళా సమితి అభినందించింది.

అలాగే తెర వెనుక నిర్విరామంగా పని చేసిన కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు, మహిళా కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు, మిత్రులకు, గణేశ మందిరాన్ని అద్భుతంగా మలిచిన ఏకే శ్రీకాంత్ రెడ్డి, గుత్తుల దుర్గాప్రసాద్‌లను కూడా అభినందించింది. వివిధ కార్యక్రమాలను సమన్వయం చేయడం ద్వార కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడంలో సహకరించిన గుణ్ణం శ్రీనివాస్, బలరాం, అన్నాజీ, భారతి, వాసు, వెంకట్, సాయి సుబ్బారావు, శేఖర రాజు, నితిన్, శ్రీ, శరవణన్, రెడ్డి ప్రసాద్, స్వరూప్ కుమార్ తదితరులకు నిర్వహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-10-05T09:04:20+05:30 IST