YSRCP ALI : ఆ నాలుగు నియోజకవర్గాలపై అలీ కన్ను.. సొంతంగా సర్వేలు.. టికెట్ ఇస్తే చాలు గెలిచేస్తానని ధీమా.. అన్నీ సరే అయ్యే పనేనా..!?
ABN , First Publish Date - 2023-02-21T17:50:56+05:30 IST
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో (2024 Elections) వైసీపీ తరఫున పోటీచేయాలని సినీ నటుడు అలీ (Actor Ali) తహతహలాడుతున్నారా..? ఈసారి ఎలాగైనా సరే పోటీచేసి గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఫిక్స్ అయ్యారా..?
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో (2024 Elections) వైసీపీ తరఫున పోటీచేయాలని సినీ నటుడు అలీ (Actor Ali) తహతహలాడుతున్నారా..? ఈసారి ఎలాగైనా సరే పోటీచేసి గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఫిక్స్ అయ్యారా..? ఇప్పటికే ఆయన నాలుగు నియోజకవర్గాలను (4 Constituencies) సెలక్ట్ చేసుకుని సర్వేలు కూడా చేసి అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చారా..? ఇందుకోసం భారీగానే డబ్బులు కూడా కూడబెట్టుకున్నారా..? ఎన్నికలకు ఇంకా సమయం చాలా ఉండగానే పార్టీతో పాటు సొంతంగా కొన్ని వ్యూహాలను కూడా రచించుకుంటున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ అలీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారా.. లేకుంటే ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారా..? ఆయన సెలక్ట్ చేసుకున్న ఆ నాలుగు నియోజకవర్గాలేంటి..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
ఛాలెంజ్ చేసే స్థాయికి..!
టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలా రోజులుగా అలీ తహతహలాడుతున్నారు. అప్పట్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి టికెట్ కన్ఫామ్ అయిపోయిందని కూడా టాక్ నడిచినా చివరికి అదేమీ జరగలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరి రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అయితే అప్పట్లో టీడీపీ, జనసేన రెండూ పార్టీలకు బాగా దగ్గరగా ఉన్న అలీ.. ఎవరూ ఊహించని రీతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సమక్షంలో వైసీపీ (YSRCP) కండువా కప్పుకున్నారు. వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని కట్టబెట్టారు. వాస్తవానికి అలీ ఆశించిన పదవి వేరు.. ఇప్పుడవన్నీ ఇక్కడ అప్రస్తుతం. అలా రాజకీయంగా అటు టీడీపీకి.. ఇటు జనసేనకు బద్ధ శత్రువుగా మారారు. ఎంతలా అంటే.. ఏకంగా పవన్ కల్యాణ్‌నే (Pawan Kalyan) వ్యతిరేకించి ఆయనపైనే పోటీ చేస్తానని ఛాలెంజ్ (Challange) చేసే పరిస్థితికి వచ్చారు. ఈ చాలెంజ్‌తో అలీని పవన్ వీరాభిమానులు (Pawan Fans), జనసేన కార్యకర్తలు ఓ రేంజ్‌లో ఆటాడేసుకున్నారు.
పోటీ ఎక్కడ్నుంచో..!
రానున్న ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి చేయాల్సిందే.. గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని తెగ ఉబలాటపడుతున్నారట. తన సామాజికవర్గంతో పాటు గెలిచే అవకాశాలు ఏయే నియోజకవర్గాల్లో ఉన్నాయని వ్యక్తిగతంగా సర్వేలు కూడా చేయించారని టాక్ నడుస్తోంది. ఇందులో గుంటూరు ఈస్ట్ (Guntur East), కర్నూలు సిటీ (Kurnool City), కడప సిటీ (Kadapa City), రాజమండ్రి (Rajahmundry) అసెంబ్లీ స్థానాలు ఉన్నాయట. ఈ నియోజకవర్గాల్లో ఏ చోట నుంచి పోటీ చేసినా సరే కచ్చితంగా గెలుస్తాననే ధీమా అలీకి ఉందట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే అలీ చెప్పినదంతా విన్న జగన్.. ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదట. అలీ సినిమా పరంగా మంచి నటుడే కావచ్చు.. అంతకంటే ఎక్కువ పేరున్న వ్యక్తే కావచ్చు. కానీ నటన, రాజకీయం వేరు అనేది ఇప్పటి వరకూ రీల్ నుంచి రియల్ లైఫ్ పాలిటిక్స్‌లోకి వచ్చిన పలువురి విషయాల్లో నిరూపితమైంది. పైగా రానున్న ఎన్నికల్లో ఎలా గెలవాలని.. ఏం చేస్తే గెలుస్తామని కాకలు తీరిన నేతలే అర్థం కాక జుట్టు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అలీ పోటీచేస్తే ఏ మాత్రం గెలుస్తారనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే.
కోట్లు రె‘ఢీ’ కానీ.. అయ్యే పనేనా..!
తాను కోరుకున్న అసెంబీ స్థానాన్ని ఇస్తే 20 నుంచి 30 కోట్లు డబ్బులు సొంతంగా ఖర్చుపెట్టడానికి కూడా అలీ సిద్ధమయ్యారట. వాస్తవానికి అలీ కోరే ఆ నలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన వారంతా పెద్ద తలకాయలే. గుంటూరు ఈస్ట్ నుంచి మహ్మద్ ముస్తఫా షేక్ (Mohammad Musthafa Shaik).. ఈయన ఈ నియోజకర్గం నుంచి టఫ్ ఫైట్‌లోనూ రెండుసార్లు గెలిచి నిలిచారు. ఒకసారి మంత్రి పదవి కూడా జస్ట్ మిస్సయ్యిందని ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ధీమాతోనే ఉన్నారాయన. ఇక కర్నూలు అసెంబ్లీ విషయానికొస్తే.. 2014 ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి (SV Mohan Reddy) వైసీపీ తరఫున గెలిచి టీడీపీ (Telugudesam) కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల ముందు మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో అబ్ధుల్ హఫీజ్ ఖాన్ (Abdul Hafeez Khan) పోటీ చేసి 5,353 ఓట్ల మెజార్టీ గెలిచి బయటపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటాపోటీగా ఉన్నారు.. టికెట్ తనకంటే తనకని ఇద్దరూ చెప్పుకుని తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దర్నీ కాదని అలీకి టికెట్ ఇస్తారా అనేది సందేహమే. ఇక కడప విషయానికొస్తే.. ఈ నియోజకవర్గంపై చాలా మంది కన్నే ఉంది. ఇప్పటికే అంజద్ భాషా (Amzath Basha Shaik Bepari) 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు.. రానున్న ఎన్నికల్లో తనకే అధిష్టానం టికెట్ ఇస్తుందని ధీమాతో ఉన్నారు. ఇక మిగిలిన ఒక్క నియోజకవర్గం రాజమండ్రి.. ఇందులో రూరల్, సిటీ ఉన్నాయి. ఈ రెండింటిలోనూ పరిస్థితి చాలా టఫ్‌గానే ఉంది. అలీ భావిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులే పోటా పోటీగా టికెట్లు ఆశిస్తున్నారే తప్ప.. ఖాళీ అయితే ఎక్కడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం అంతటి ఉద్ధండులను కాదని అలీకి టికెట్ ఇవ్వడం అంటే పెద్ద గగనమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి చూస్తే.. అలీ ఆశ చాలా పెద్దదే, డబ్బులు రెడీ చేసుకోవడం సరే, పోటీ చేయాలని నియోజకవర్గాలు సెలక్ట్ చేసుకోవడమూ సరే.. కానీ ఏ మాత్రం వర్కవుట్ అవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇంతకీ వైఎస్ జగన్ మనసులో ఏముంది..? అలీ కోరినట్లు టికెట్ ఇస్తారా.. ఇస్తే ఎక్కడ్నుంచి ఇస్తారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.