AP Politics : మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2023-09-06T17:41:32+05:30 IST
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి (Ayyanna Patrudu) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. అర్నేష్ కుమార్ (Arnesh Kumar Guidelines) మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటించాలని ఏపీ పోలీసులను (AP Police) హైకోర్టు ఆదేశించింది...
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి (Ayyanna Patrudu) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ ఊరట లభించింది. అర్నేష్ కుమార్ (Arnesh Kumar Guidelines) మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటించాలని ఏపీ పోలీసులను (AP Police) హైకోర్టు ఆదేశించింది. గన్నవరం (Gannavaram) నియోజకవర్గంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అయ్యన్న హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy), ఇతర ప్రజా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని (Perni Nani) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. అయ్యన్న వేసిన పిటీషన్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయ్యన్న తరఫున కోర్టులో న్యాయవాది వీ.వీ సతీష్ వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన ఐపీసీ సెక్షన్‌లు 505(2), 153A పిటిషనర్‌కి వర్తించదని వాదించారు. అసభ్య పదజాలం ప్రచురించి ప్రచారం చేసిన వారికి 505(2) వర్తిస్తుందని సతీష్ చెప్పారు.
అసలేం జరిగింది..?
ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై అలాంటి పదప్రయోగం చేయవచ్చా..? అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇలాంటి భాషను వాడటం సరికాదని హైకోర్టు చెప్పింది. అధికార పార్టీ నేతలు అసభ్య పదజాలం వాడటం వల్లే ఇటువంటి భాషను వాడాల్సి వచ్చిందని న్యాయవాది సతీష్ కోర్టుకు వివరించారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని వాదించారు.అయితే.. పిటిషనర్‌కు ఇటువంటి భాష వాడటం అలవాటు అయిపోయిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనంతరం అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా.. అనుచిత వ్యాఖ్యల కేసులో అయ్యన్న పాత్రుడిని అదుపులోనికి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్‌గేట్ వద్ద వదిలిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది.