Viral Video: రంగులు మార్చే ఈ కప్ప.. పాము కనబడగానే ఏం చేసిందో చూస్తే.. ఖచ్చితంగా షాక్ అవుతారు..
ABN , First Publish Date - 2023-03-24T19:22:59+05:30 IST
పాము అంటే కప్పలకు వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే అవి కనిపిస్తే చాలు.. ఆమడ దూరం పారిపోతుంటాయి. పొరపాటున ఎక్కడైనా పాము ఎదురుపడితే, ఇక దాని నుంచి తప్పించుకోవడం.. దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే ...
పాము అంటే కప్పలకు వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే అవి కనిపిస్తే చాలు.. ఆమడ దూరం పారిపోతుంటాయి. పొరపాటున ఎక్కడైనా పాము ఎదురుపడితే, ఇక దాని నుంచి తప్పించుకోవడం.. దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే అన్ని వేలలా ఇలాగే జరుగుతుందీ అంటే.. అది కూడా అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. రంగులు మార్చే ఓ కప్పకు పాము తారసపడుతుంది. వెంటనే పారిపోవాల్సిన కప్ప.. చివరికి ఏం చేసిందంటే..
సోషల్ మీడియాలో పాము, కప్పకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. రంగులు మార్చే ఓ కప్పకు రాత్రి వేళ గడ్డి పొదల్లో ఓ పాము తారసపడుతుంది. దాన్ని చూడగానే భయపడి పారిపోవాల్సిన కప్ప.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. చటుక్కున ఆ పామును నోటితో పట్టుకుంటుంది. అంతటితో ఆగకుండా.. న్యూడిల్స్ తింటున్నట్లుగా ఫీల్ అవుతూ.. కొంచెం కొంచెం దాన్ని నోట్లోకి (frog swallowed the snake) తీసుకుంటుంది. కప్ప చేసిన పనికి పాముకు చుక్కలు కనపడతాయి. దాన్నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా కప్ప మాత్రం దాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా కొరికేస్తుంది. దీంతో పాము మెలికలు తిరుగుతూ.. చివరకు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
Viral Video: ఈమె డాన్స్ చూసి భయపడుతున్న జనాలు.. మరీ మీద మీద పడుతూ ఇదేం డాన్స్‌రా బాబోయ్..
యూరోపియన్ ప్రాంతాల్లో కనిపించే ఈ ఆకుపచ్చ కప్పలకు రంగులు మార్చే గునం ఉంటుందట. ఇవి ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికాలో (Europe, Asia, North America) ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఆకుపచ్చని కప్పలు.. కీటకాలు, ఈగలు, సీతాకోకచిలుకలు, వానపాములు తదితరాలను తింటూ ఉంటాయి. ఉష్ణోగ్రత, కాంతికి అనుగుణంగా ఇవి తమ రంగును మారుస్తూ (Color changing frogs) ఉంటాయట. మొత్తానికి పామును మింగిన ఈ కప్ప వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పామును చూసి న్యూడిల్స్ అనుకుని ఉంటుంది.. అని కొందరు, వామ్మో! ఇదేం కప్పరా నాయనా.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: వామ్మో! ఇది కలా నిజమా.. పూర్తిగా ఎండిపోయిన చేప మీద.. నీరు పోయగానే..