Wheel Less Bicycle: ఈ ఇంజనీర్‌ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. టైర్లు లేకుండానే సైకిల్‌ను రెడీ చేసేశాడు..!

ABN , First Publish Date - 2023-07-08T15:28:41+05:30 IST

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో మంది తమ ప్రతిభకు పదును పెట్టి వారి వారి రంగాల్లో ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఇంకొందరు ఇంకాస్త వినూత్నంగా ఆలోచిస్తూ.. సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియో ..

Wheel Less Bicycle: ఈ ఇంజనీర్‌ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. టైర్లు లేకుండానే సైకిల్‌ను రెడీ చేసేశాడు..!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో మంది తమ ప్రతిభకు పదును పెట్టి వారి వారి రంగాల్లో ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఇంకొందరు ఇంకాస్త వినూత్నంగా ఆలోచిస్తూ.. సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. టైర్లు లేకుండా తయారు చేసిన కారు, అలాగే లగేజీ ట్రాలీ తరహాలో తయారు చేసిన వాహనం.. ఇలా అనేక వీడియోలను చూశాం. ప్రస్తుతం ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. టైర్లు లేకుండా తయారు చేసిన సైకిల్‌ను చూసిన నెటిజన్లు.. ఈ ఇంజనీర్ తెలివికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. సెర్గి గోర్డివ్ అనే ఇంజినీర్ (Engineer) .. టైర్లు అవసరం లేని సైకిల్‌ని (bicycle without tires) తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ముందుగా ఓ పేపర్‌పై బొమ్మలు గీసుకుని, బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసుకున్నాడు. సీటు, పెడల్స్, చైన్ సెట్, హ్యాండిల్ బార్ తదితరాలు తీసుకుని ప్రయోగం స్టార్ట్ చేశాడు. అయితే చక్రాలకు బదులుగా పొడవాటి ఇనుప బార్ తీసుకుని, దానికి చాలా చైన్‌లను (Bicycle chains) ఒకదాని పక్క మరోటి ఏర్పాటు చేశాడు.

Viral video: మా అమ్మకు దక్కిన అత్యున్నత పురస్కారం.. అంటూ కూతురు పెట్టిన వీడియో చూస్తే..

cycle-viral-videos.jpg

ఇలా ముందు, వెనుకా దీర్ఘచతురస్రాకార చక్రాలను ఏర్పాటు చేశాడు. వాటిని మరో చైన్ సాయంతో సైకిల్ పెడల్‌కి అనుసంధానం చేశాడు. సైకిల్‌ను సిద్ధం చేసి, ట్రయల్ రన్ చేశాడు. చివరకు అనుకున్నది సాధించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఇదో అద్భుతమైన ప్రయోగం’’.. అని కొందరు, ‘‘ఇది పంక్షర్ కాని సైకిల్’’.. అని ఇంకొందరు, ‘‘ఎలా వస్తాయయ్యా... ఇలాంటి ఐడియాలు’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నీ భార్య కంటే నేనే బెటర్‌.. అంటూ లిఫ్ట్‌లోనే ఓ మహిళ రచ్చ.. నా భార్య గర్భవతి అంటూ అతడు అడిగిన ఒక్క మాటకే..!

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-08T15:28:41+05:30 IST