Viral Video: ఆ డ్రైవర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒకే ఒక్క క్షణంలో ఎంత ప్రమాదం తప్పిందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-07-07T17:52:23+05:30 IST
ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. చాలా మంది తప్పని తెలిసినా నిబంధనలు ఉల్లఘించి మరీ ప్రమాదాలకు కారణమవుతుంటారు. అలాగే కొన్నిసార్లు కొందరు డ్రైవర్ల అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదాలు తృటిలో తప్పిపోతుంటాయి. ఇలాంటి..
ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. చాలా మంది తప్పని తెలిసినా నిబంధనలు ఉల్లఘించి మరీ ప్రమాదాలకు కారణమవుతుంటారు. అలాగే కొన్నిసార్లు కొందరు డ్రైవర్ల అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదాలు తృటిలో తప్పిపోతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. డ్రైవర్‌కు హ్యాట్సాప్ చెబుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొండ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎత్తైన కొండ చరియలు విరిగిపడి (landslide) రోడ్ల మీద పడుతున్నాయి. ఈ క్రమంలో కల్కా-సోలన్ హైవేపై చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి (Viral video) సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హైవే పక్కన కొండ చరియలు ప్రమాదకరంగా ఉండడంతో కొంత మంది వాహనదాలు వెళ్లాలా, వద్దా అని ఆలోచిస్తూ ఆపుకొని ఉంటారు. ఈ సమయంలో ఓ కారు ఎదురుగా వస్తూ ఉంటుంది.
అదే సమయంలో పక్కన ఉన్న కొండ పైనుంచి కొండచరియలు విరిగిపడతాయి. పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు జారి ఒక్కసారిగా రోడ్డుపై పడతాయి. ఓ పెద్ద రాయి రోడ్డు పైకి వచ్చి కారు ఢీకొనే సమయంలో డ్రైవర్ (Car driver) .. చాకచక్యంగా వాహనాన్ని పక్కకు మళ్లిస్తాడు. వేగంగా ముందుకు వెళ్లి రోడ్డు పక్కన నిలిపేస్తాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనను అక్కడే ఉన్న వాహనదారులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి సమయంలో సాహసాలు చేయడం ప్రమాదకరం’’.. అంటూ సూచిస్తున్నారు.