Viral Video: ఆడు మగాడ్రా బుజ్జి.. చిరు, తారక్‌కు ఏ మాత్రం తగ్గలేదు.. చిరుత పులిని ఏం చేశాడో చూడండి!..
ABN , First Publish Date - 2023-07-15T14:39:52+05:30 IST
ఒక మనిషి చిరుత పులిని ఎదురించి, దానిపై దాడి చేయడమే కాకుండా బంధించిన ఘటనలను మనం సినిమాల్లోనే చూశాం. మెగాస్టార్ చిరంజీని (chiranjeevi) నటించిన ’మృగరాజు’ సినిమా నుంచి ఇటీవల రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్( junior NTR) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ వరకు చాలా చిత్రాల్లో ఈ సీన్‌లు కనిపించాయి. ఆయా సినిమాల్లో చిరంజీవి, ఎన్టీఆర్ చిరుత పులులను బంధించడం మనం తెర మీద చూసి ఆనందించాం. తాజాగా అచ్చం అలాంటి ఘటనే నిజ జీవితంలోనూ చోటు చేసుకుంది.
హాసన్, కర్ణాటక: ఒక మనిషి చిరుత పులిని ఎదురించి, దానిపై దాడి చేయడమే కాకుండా బంధించిన ఘటనలను మనం సినిమాల్లోనే చూశాం. మెగాస్టార్ చిరంజీని (chiranjeevi) నటించిన ’మృగరాజు’ సినిమా నుంచి ఇటీవల రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్( junior NTR) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ వరకు చాలా చిత్రాల్లో ఈ సీన్‌లు కనిపించాయి. ఆయా సినిమాల్లో చిరంజీవి, ఎన్టీఆర్ చిరుత పులులను బంధించడం మనం తెర మీద చూసి ఆనందించాం. తాజాగా అచ్చం అలాంటి ఘటనే నిజ జీవితంలోనూ చోటు చేసుకుంది. ఓ మనిషి చిరుత పులిని ఎదురించి దాంతో ఫైటింగ్ కూడా చేశాడు. చివరకు ఆ పోటీలో సదరు వ్యక్తినే విజయం వరించింది. దీంతో అతను చిరుతను బంధించి తాడుతో తన బైక్‌పై వెనకాల కట్టుకుని వెళ్లాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హాసన్ జిల్లా బాగివాలు గ్రామంలో ( Karnataka Bagivalu village in Hassan district) నివసించే ముత్తు (Muthu) అనే వ్యక్తికి వ్యవసాయ భూమి ఉంది. దీంతో రోజూ కార్యక్రమంలో భాగంగానే తన పొలానికి వెళ్తుండగా 9 నెలల వయసు గల చిరుత పులి (9-month-old leopard) ఎదురుపడింది. మనిషిని చూసిన చిరుత ఉరికే ఎందుకు ఉంటుంది? ముత్తుపై దాడి చేసింది. ఆ సమయంలో ఏ మాత్రం బెదరని ముత్తు.. చిరుత పులిపై ఎదురుదాడి చేశాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు ఫైటింగ్ జరిగింది. కానీ ఈ పోరాటంలో ముత్తునే విజయం వరించింది. దీంతో చిరుత పులిని బంధించిన ముత్తు తన వద్ద ఉన్న తాడుతో దాని నాలుగు కాళ్లను కట్టేశాడు. అంతటితో ఆగకుండా తన బైక్‌కు వెనకాల గొర్రె పిల్లను కట్టిన మాదిరిగా కట్టాడు. అలా బైక్‌కు వెనకాల కట్టుకుని నేరుగా స్థానిక అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లాడు. ముత్తు అలా వెళ్లడాన్ని చూసిన పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతుంది.
చిరుత పులితో వచ్చిన ముత్తును చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. విషయం తెలుసుకుని వెంటనే చిరుతపులిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముత్తుకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. "ముత్తుకు ఎటువంటి చెడు ఉద్దేశాలు లేవు. స్వీయ రక్షణలో భాగంగానే చిరుత పులిని కట్టేశాడు. అవగాహన రాహిత్యంతోనే అతను ఇలా చేశాడు. వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు మరోసారి ఇలాంటివి చేయకూడదని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశాం. ప్రస్తుతం చిరుత వైద్యుల పర్యవేక్షణలో ఉంది.’’ అని అటవీ అధికారులు తెలిపారు. నిజానికి హాసన్ జిల్లా ప్రాంతంలో వన్యప్రాణుల బెడద ఎక్కువగా ఉంది. వన్యప్రాణులు ఇలా పొలాల్లోకి రావడం కొత్తేం కాదు. దీంతో అటవీ అధికారులు వన్యప్రాణుల భారీ నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇక సోషల్ మీడియలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ముత్తుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఇతను సినిమాల్లో చిరంజీవి, ఎన్టీఆర్‌కు ఏ మాత్రం తగ్గలేదు’’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఆడు మగాడ్రా బుజ్జి అంటూ రాసుకొస్తున్నారు.