IND vs PAK: కోహ్లీ నుంచి జెర్సీలు తీసుకోవడం సరికాదు.. బాబర్ అజామ్‌పై పాక్ లెజెండ్ ఆగ్రహం
ABN , First Publish Date - 2023-10-15T15:03:25+05:30 IST
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయం అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ జెర్సీని బహుమతిగా అందుకున్నాడు. సాధారణంగా కోహ్లీని బాబర్ అజామ్ విపరీతంగా అభిమానిస్తుంటాడు.
అహ్మదాబాద్: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయం అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ జెర్సీని బహుమతిగా అందుకున్నాడు. సాధారణంగా కోహ్లీని బాబర్ అజామ్ విపరీతంగా అభిమానిస్తుంటాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిసిన అనంతరం తాను స్వయంగా సంతకం చేసిన టీమిండియా జెర్సీని ఇవ్వాలని కోహ్లీని అడిగాడు. వెంటనే బాబర్ అడిగినట్టుగానే తాను సంతకం చేసిన రెండు జెర్సీలను బాబర్ అజామ్‌కు విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ వ్యవహారం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌కు ఏ మాత్రం నచ్చలేదు. కోహ్లీ నుంచి జెర్సీలు తీసుకున్న బాబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి సమయంలో పబ్లిక్‌గా విరాట్ కోహ్లీ నుంచి జెర్సీలు తీసుకోవడం సరికాదని మండిపడ్డాడు. కోహ్లీ నుంచి జెర్సీ తీసుకోవడానికి ఇది తగిన సమయం కాదని ఆయన మండిపడ్డారు. కావాలంటే వాళ్ల అంకుల్ వాళ్ల అబ్బాయి కోహ్లీ జెర్సీ అడిగాడని, అది కూడా మ్యాచ్ అయిపోయాక ప్రైవేట్‌గా డ్రెస్సింగ్ రూమ్ వద్ద తీసుకోవాల్సిందని ఆయన అన్నారు.
ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం అక్రమ్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సమయంలో పబ్లిక్‌గా విరాట్ కోహ్లీ నుంచి బాబర్ జెర్సీలను తీసుకోకుండా ఉండాల్సింది. మ్యాచ్ అనంతరం అలా చేయకుండా ఉండాల్సింది. ప్రైవేట్‌గా డ్రెస్సింగ్ రూమ్ వద్ద తీసుకోవాల్సింది. ఒకవేళ మీ అంకుల్ వాళ్ల అబ్బాయి కోహ్లీ జెర్సీని అడిగితే.. మ్యాచ్ అయిపోయాక డ్రెస్సింగ్ రూమ్ వద్ద ప్రేవేట్‌గా ఆ జెర్సీలను తీసుకోవాల్సింది’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌పై భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ విభాగాల్లో రాణిస్తూ శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86) నుంచి మరో కీలక ఇన్నింగ్స్ రాగా.. శ్రేయాస్ అయ్యర్ (62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. తాజా టోర్నీలో హ్యాట్రిక్ కొట్టిన భారత్ అటు పాయింట్ల పట్టికలోనూ టాప్‌లో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. బాబర్ ఆజమ్ (50), రిజ్వాన్ (49), ఇమామ్ ఉల్ హక్ (36) మాత్రమే రాణించారు. బుమ్రా, హార్దిక్, కుల్దీప్, జడేజా, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ఛేదనలో భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి గెలిచింది. షహీన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బుమ్రా నిలిచాడు.