Share News

SA vs BAN: విధ్వంసకర సెంచరీతో అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్న డికాక్.. మ్యాచ్ మొత్తంలో నమోదైన ఈ మైల్‌స్టోన్స్ గురించి తెలిస్తే..

ABN , First Publish Date - 2023-10-25T08:48:52+05:30 IST

ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. సునాసయంగా పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శన చేసింది.

SA vs BAN: విధ్వంసకర సెంచరీతో అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్న డికాక్.. మ్యాచ్ మొత్తంలో నమోదైన ఈ మైల్‌స్టోన్స్ గురించి తెలిస్తే..

ముంబై: ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. సునాసయంగా పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన సఫారీలు బంగ్లాదేశ్‌పై 149 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించారు. మొదట ఓపెనర్ క్వింటన్ డికాక్(174) భారీ సెంచరీకి తోడు చివర్లో క్లాసెన్(90) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ మాక్రమ్ (60) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో మిల్లర్ మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 382/5 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బౌలర్లు కూడా సత్తా చాటడంతో బంగ్లాదేశ్ జట్టు 233 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో ప్రపంచకప్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసిన సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో 17 మైల్ స్టోన్ రికార్డులు కూడా నమోదయ్యాయి. అందులో డికాక్ బ్యాట్ నుంచే ఏకంగా 9 రికార్డులు వచ్చాయి.


2- ఈ మ్యాచ్‌లో డికాక్ సాధించిన సెంచరీ ప్రపంచకప్ చరిత్రలో అతనికి మూడోవది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో సౌతాఫ్రికా బ్యాటర్‌గా నిలిచాడు. నాలుగు సెంచరీలతో ఏబీ డివిలియర్స్ మొదటి స్థానంలో ఉన్నాడు.

3- వన్డే ఫార్మాట్‌లో భారత్‌లో డికాక్‌కు ఇది ఐదో సెంచరీ. భారత్‌లో పర్యటించి అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాళ్లలో అతను ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఏడు సెంచరీలతో సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ మొదటి స్థానంలో, 6 సెంచరీలతో వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నారు.

1- బంగ్లాదేశ్‌పై డికాక్‌కు ఇది రెండో వన్డే సెంచరీ. దీంతో బంగ్లాదేశ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్ల జాబితాలో మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లాతో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు.

2- ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై క్వింటాన్ డికాక్ 174 పరుగులు చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా బ్యాటర్ నమోదు చేసిన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే. ఈ జాబితాలో 1996 ప్రపంచకప్‌లో 188 పరుగులు చేసిన గ్యారీ కిర్‌స్టెన్ మొదటి స్థానంలో ఉన్నాడు.

2- ఈ మ్యాచ్‌లో డికాక్ చేసిన 174 పరుగులు అతని వన్డే కెరీర్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇంతకుముందు 2016లో ఆస్ట్రేలియాపై చేసిన 178 పరుగులు అత్యధిక స్కోర్‌గా ఉంది.

1- ఈ మ్యాచ్‌లో డికాక్ చేసిన 174 పరుగులు వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఓ వికెట్ కీపర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో 2007 ప్రపంచకప్‌లో 149 పరుగులు చేసిన ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ రికార్డును డికాక్ బ్రేక్ చేశాడు.

3- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు 150+స్కోర్లు సాధించిన వికెట్ కీపర్‌గా డికాక్ నిలిచాడు. కాగా వన్డేల్లో డికాక్‌కు ఇది మూడో 150+ స్కోర్ కావడం గమనార్హం.

2- ఈ మ్యాచ్‌లో డికాక్ చేసిన సెంచరీ అతని వన్డే కెరీర్లో 20వది. ఇందుకు డికాక్ 150 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా తరఫున వేగంగా 20 వన్డే సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా మొదటి స్థానంలో ఉన్నాడు. అంతను 108 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కు అందుకున్నాడు.

12160- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా డికాక్ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 12 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

2- ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 49 బంతుల్లోనే 90 పరుగులు బాదేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సులున్నాయి. దీంతో వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన రెండో బ్యాటర్‌గా డివిలియర్స్‌తో కలిసి క్లాసెన్ రెండో స్థానంలో ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 9 సిక్సులు బాదిన మిల్లర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

1- ఈ ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఏకంగా 3 సార్లు 350కి పైగా పరుగులు సాధించించింది. దీంతో ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు 350+ స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది.

1- ప్రపంచకప్ చరిత్రలో సౌతాఫ్రికా జట్టు 8 సార్లు 350+ స్కోర్లు నమోదు చేసింది. దీంతో అత్యధిక సార్లు ఈ మార్కు అందుకున్న జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో 7 సార్లు ఈ మార్కు అందుకున్న ఆస్ట్రేలియాను అధిగమించింది.

56- ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సుల ద్వారా క్లాసెన్ తన వన్డే కెరీర్‌లో 50 సిక్సులను పూర్తి చేసుకున్నాడు.

814- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా బంగ్లాదేశ్ ఆటగాడు మహ్మదుల్లా వన్డే ప్రపంచకప్ చరిత్రలో 800 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

1- ఈ మ్యాచ్‌లో మహ్మదుల్లా చేసిన సెంచరీ వన్డే ప్రపంచకప్ చరిత్రలో మూడోవది. దీంతో వన్డే ప్రపంచకప్ చరిత్రలో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

2- ప్రపంచకప్ చరిత్రలో నాలుగు లేదా అంతకన్నా దిగువ స్థానంలో సెంచరీ సాధించడం మహ్మదుల్లాకు ఇది రెండో సారి. దీంతో 4 లేదా అంతకన్నా దిగువ స్థానంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మహ్మదుల్లా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో నాలుగేసి సెంచరీలతో ఏబీ డివిలియర్స్, మహేల జయవర్దేనే మొదటి స్థానంలో ఉన్నారు.

1- ఈ మ్యాచ్‌లో మహ్మదుల్లా చేసిన 111 పరుగుల ఇన్నింగ్స్‌లో 4 సిక్సులున్నాయి. దీంతో ప్రపంచకప్ చరిత్రలో బంగ్లాదేశ్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా లిటన్ దాస్‌తో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు.

Updated Date - 2023-10-25T08:55:44+05:30 IST