Minister KTR: అండగా ఉంటాం అధైర్యపడొద్దు.. నవీన్ తండ్రితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
ABN , First Publish Date - 2023-03-18T12:18:52+05:30 IST
టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage)తో మనస్థాపానికి గురై సిరిసిల్లకు చెందిన
రాజన్న సిరిసిల్ల జిల్లా: టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage)తో మనస్థాపానికి గురై సిరిసిల్లకు చెందిన యువకుడు నవీన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నయువకుడు నవీన్‌ది స్వస్థలం సిరిసిల్ల. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని విషయం తెలియడంతో వెంటనే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) మృతుడి తండ్రి నాగభూషణంతో ఫోన్లో మాట్లాడారు. అండగా ఉంటాం అధైర్యపడొద్దని కేటీఆర్ (KTR)భరోసానిచ్చారు. అర్దాంతరంగా తనువు చాలించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ పాలకవర్గానికి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బివైనరగ్‌కు చెందిన నవీన్ కుమార్ శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగాన్వేషణలో విసిగిపోయి.. ప్రాణాలు తీసుకునే ముందు నవీన్ రాసిని సూసైడ్ లెటర్ అందరినీ కంటతడి పెట్టించింది. ‘‘అన్ సాటిస్ఫైడ్ లైఫ్.. నో వన్ ఇస్ రీజన్ ఫర్ దిస్… ఐ యాం యూస్ లెస్ ఫర్ ఆల్ జాబ్ లెస్.. థాంక్యూ టు మై ఫ్యామిలీ… ఐ క్విట్స్’’ అంటూ నవీన్ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టించింది. గ్రామానికి చెందిన చిటికెన నాగభూషణం, సుశీల దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో నవీన్ కుమార్ చిన్నవాడు. నవీన్ సాఫ్ఠ్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగం కోసం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారం, ఆ తరువాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర మనస్థాపానికి గురైన నవీన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.