YV Subbareddy : తిరుమల మాదిరిగా కరీంనగర్‌లో ఆలయం | YV Subbareddy comments PVCH

YV Subbareddy : తిరుమల మాదిరిగా కరీంనగర్‌లో ఆలయం

ABN , First Publish Date - 2023-05-31T10:18:36+05:30 IST

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇరవై కోట్లతో టీటీడీ ఆలయానికి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో అలయం నిర్మాణం జరుగుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ఉన్నట్లే కరీంనగర్‌లోనూ ఆలయం ఉంటుందన్నారు. ఇక్కడ నాలుగు మాడ వీధులు ఉంటాయన్నారు. తిరుమలలో మాదిరిగా స్వామివారి కైంకర్యాలు ఉంటాయన్నారు.

YV Subbareddy : తిరుమల మాదిరిగా కరీంనగర్‌లో ఆలయం

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇరవై కోట్లతో టీటీడీ ఆలయానికి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో అలయం నిర్మాణం జరుగుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ఉన్నట్లే కరీంనగర్‌లోనూ ఆలయం ఉంటుందన్నారు. ఇక్కడ నాలుగు మాడ వీధులు ఉంటాయన్నారు. తిరుమలలో మాదిరిగా స్వామివారి కైంకర్యాలు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ కోరిక మేరకు కరీంనగర్‌లో ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో వెంకన్న ఆలయం కట్టడం తమ అదృష్టమని పేర్కొన్నారు. ఆలయాలకు.. రాజకీయాలకు సంబంధం లేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-05-31T10:18:36+05:30 IST