Ranjith Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుంది
ABN , Publish Date - Dec 25 , 2023 | 03:31 PM
చేవెళ్ల పార్లమెంట్ ( Chevella Parliament ) ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ( Ranjith Reddy ) తెలిపారు. సోమవారం నాడు చేవెళ్లలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘నన్ను చేవె్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు’’ అని రంజిత్‌రెడ్డి చెప్పారు.
చేవెళ్ల : చేవెళ్ల పార్లమెంట్ ( Chevella Parliament ) ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ( Ranjith Reddy ) తెలిపారు. సోమవారం నాడు చేవెళ్లలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘నన్ను చేవె్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్. మీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పడం అసత్యం. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు’’ అని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు.