AP Politics: చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల కీలక భేటీ..
ABN , Publish Date - Apr 12 , 2024 | 01:46 PM
ఉండవల్లిలో(Undavalli) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నిసవాంలో ఎన్డీయే నేతలు కీలక భేటీ ప్రారంభమైంది. బీజేపీ(BJP) రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్ధార్థ నాథ్ సింగ్, పార్టీకి చెందిన ఇతర నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ భేటీ..
అమరావతి, ఏప్రిల్ 12: ఉండవల్లిలో(Undavalli) టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నిసవాంలో ఎన్డీయే నేతలు కీలక భేటీ ప్రారంభమైంది. బీజేపీ(BJP) రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్ధార్థ నాథ్ సింగ్, పార్టీకి చెందిన ఇతర నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేసే అంశంపై చర్చించనున్నారు. దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాలపై కూడా చర్చలు జరపనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీల మధ్య సమన్వయం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అమలాపురంలో ఉన్న చంద్రబాబు.. ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు జనసేన అధినేతన పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్ధార్థ సింగ్, అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు ఎన్నికల పర్యటన ముగించుకుని నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, మూడు పార్టీల ఉమ్మడి ప్రచారంపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధానంగా అనపర్తి, తంబళ్లపల్లి, కడప, జమ్మలమడుగు సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నట్లు సమాచారం.