Share News

AP NEWS: చిత్తూరు జిల్లాలో ఆడదాం ఆంధ్రా'’ లో విద్యార్థుల మధ్య ఘర్షణ

ABN , Publish Date - Jan 10 , 2024 | 07:09 PM

ఏపీ ప్రభుత్వం "ఆడుదాం.. ఆంధ్రా’’ పేరుతో ప్రతిష్టాత్మకంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం పలు వివాదాలకు దారి తీస్తోంది. కుప్పంలో బుధవారం నాడు ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది.

AP NEWS: చిత్తూరు జిల్లాలో  ఆడదాం ఆంధ్రా'’ లో విద్యార్థుల మధ్య ఘర్షణ

చిత్తూరు: ఏపీ ప్రభుత్వం "ఆడుదాం.. ఆంధ్రా’’ పేరుతో ప్రతిష్టాత్మకంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం పలు వివాదాలకు దారి తీస్తోంది. కుప్పంలో బుధవారం నాడు ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. కుప్పంలో "కొట్టుకుందాం ఆంధ్రా'గా "ఆడదాం ఆంధ్రా' కార్యక్రమం మారింది.

కుప్పం ద్రావిడ వర్సిటీలో "ఆడదాం ఆంధ్రా' కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది."ఆడదాం ఆంధ్రా' కబడ్డీ పోటీల్లో కనుమలపల్లి, కాడేపల్లి జట్లు ఘర్షణకు దిగాయి. విద్యార్థుల నడుమ ఆటలో తలెత్తిన వివాదంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి బాహాబాహికి దిగారు. పరస్పరం విద్యార్థులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. కుర్చీలు విసిరేస్తూ, కర్రలతో దాడిచేస్తూ విద్యార్థులు వీరంగం సృష్టించారు. వందల మంది విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దాంతో వర్సిటీలో ఉద్రిక్తతగా మారింది. ఇంత జరుగుతున్నా వర్సిటీ అధికారులు, కార్యక్రమ నిర్వాహకులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు.

Updated Date - Jan 10 , 2024 | 07:10 PM