Roja: వైఎస్ఆర్ ఎప్పుడో జగన్, షర్మిళకు ఆస్తులు పంచారంటూ రోజా సంచలనం
ABN , Publish Date - Feb 23 , 2024 | 12:09 PM
మంత్రి రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిళకు రాజకీయ అవగాహన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు భర్తీ చెయ్యని డీఎస్సీ పోస్టులను జగన్ భర్తీ చేశారన్నారు. 6100 పోస్టుల భర్తీకీ ప్రస్తుతం జగన్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.
తిరుమల: మంత్రి రోజా (Minister Roja) నేడు తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిళ (YS Sharmila)కు రాజకీయ అవగాహన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అధికారంలో వున్నప్పుడు భర్తీ చెయ్యని డీఎస్సీ (DSC) పోస్టులను జగన్ భర్తీ చేశారన్నారు. 6100 పోస్టుల భర్తీకీ ప్రస్తుతం జగన్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.
తెలంగాణ బిడ్డని.. అక్కడి ప్రజలకు అండగా ఉంటానని.. నాలుగున్నరేళ్ల తరువాత షర్మిళ ఏపీకీ వచ్చి నానా యాగి చేస్తున్నారన్నారు. జగన్ (Jagan)పై షర్మిళ విషం చిముతున్నారన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిళని పావుగా వాడుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన ఆస్థిలో అన్నాచెల్లెలు, భార్యలకు ఎంత పంచాడో చెప్పాలన్నారు. వైఎస్ఆర్ (YSR) ఎప్పుడో జగన్, షర్మిళకు ఆస్తులు పంచారని రోజా అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..