పెద్దాపురం అభివృద్ధికి సహకరించాలి
ABN , Publish Date - Sep 29 , 2024 | 12:21 AM
సామర్లకోట, సెప్టెంబరు 28: తాను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేనైనా సామ ర్లకోట మండలంలో తన పట్ల ఎంతమాత్రం విలువలు పాటించలేదని తిరిగి గెలుపొందిన తా ను నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెస్తానని పనులు అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకా యల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం ఎంపీపీ సత్తిబాబు అధ్యక్షతన శనివారం నిర్వ
ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
సామర్లకోట, సెప్టెంబరు 28: తాను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేనైనా సామ ర్లకోట మండలంలో తన పట్ల ఎంతమాత్రం విలువలు పాటించలేదని తిరిగి గెలుపొందిన తా ను నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెస్తానని పనులు అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకా యల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం ఎంపీపీ సత్తిబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజప్ప వివిధ శాఖల నిర్వహణ తీరుపై సమీక్షించి మాట్లాడుతూ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేవంల వంద రోజులలోనే నియోజకవర్గ అభివృద్ధికి రూ. 25 కోట్ల మేర నిధులు మంజూరుచేయించి అభి వృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు. మండలంలో విద్యాశాఖ తీరు తిరోగమనంలో ఉందని ఎంఈ వో శివరామకృష్ణయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉపాధి హామీ నిధులతో మండలంలో చేపట్టనున్న సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు మండల పరిషత్పాలకవర్గం నుంచి ఏకగ్రీవంగా తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సమా వేశంలో జడ్పీటీసీ ఎలిశెట్టి అమృతానరేష్, ఎంపీ డీవో డి.శ్రీలలిత, తహశీల్దార్ కొవ్వూరి చంద్రశేఖ రరెడ్డి, ఏవో మంగతాయారు తదితరులున్నారు.
ప్రజా సమస్యలపై దృష్టి
పెద్దాపురం, సెప్టెంబరు 28: పట్టణాలు, గ్రామాల్లో ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సుధా కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.