AP Elections: నీ అభిమానానికి ఫిదా.. చంద్రబాబు కోసం ఈయన ఏం చేశాడంటే..
ABN , Publish Date - Apr 28 , 2024 | 11:57 AM
రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని హంగు ఆర్భాటాలు చేసే నేతలను అ నేక మందిని చూశాం. కానీ పార్టీ అధికారం కోల్పోయి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ పెట్టే ఒత్తిళ్లను అధిగమించి, అక్రమ కేసులకు వెరువక పార్టీ కోసం, ప్రజల కోసం, పనిచేసే నేతలు అరుదు. ఆ కోవకు చెందిన వారే మచిలీపట్నం(Machilipatnam) పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు..
విజయవాడ, ఏప్రిల్ 28: ఓ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని హంగు ఆర్భాటాలు చేసే నేతలను అ నేక మందిని చూశాం. కానీ పార్టీ అధికారం కోల్పోయి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ పెట్టే ఒత్తిళ్లను అధిగమించి, అక్రమ కేసులకు వెరువక పార్టీ కోసం, ప్రజల కోసం, పనిచేసే నేతలు అరుదు. ఆ కోవకు చెందిన వారే మచిలీపట్నం(Machilipatnam) పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి(Dandamudi Chowdary). పెనమలూరు నియోజకవర్గానికి చెందిన దండమూడి చౌదరి 2009 నుంచి టీడీపీతో(TDP) కలిసి ప్రయాణిస్తున్నారు.
నాడు పార్టీ ప్రతిపక్షంలో ఉంటే విద్యార్థి నేతగా విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేశారు. 2019లో పార్టీ ఓటమి తర్వాత మళ్లీ దండమూడి పోరాటం మొదలైంది. విద్యార్థి ఉద్యమాలపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ప్రజల కోసం తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. రాష్ట్రంలోనే తెలుగు యువత ఆధ్వర్యంలో తొలి అన్న క్యాంటిన్‌ను ఉ య్యూరులో ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో సతీసమేతంగా 11 గ్రామా ల్లో నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు.
ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు. ట్రై సైకిల్స్, బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, పేద విద్యార్థుల కు బస్‌పాస్‌లు స్కాలర్‌షిప్పులు అందించారు 2001లో అమరావతినే రాజధాని గా కొనసాగించాలని, 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని సతీసమేతంగా 16 గంటలపాటు మోకాలిపై నడుస్తూ తిరుమల కొండ ఎక్కారు. 2022 నుంచి నల్ల చొక్కా ధరించి ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేస్తున్నారు. ఇందుకు బహుమానంగా వైసీపీ ప్రభుత్వం ఆయనపై 16 కేసులు బనాయించింది.
ఇవికూడా చదవండి:
అక్కడ గెలిస్తే మంత్రి పదవి కన్ఫామ్!
పాపం కొడాలి.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..