Share News

Arvind Kejriwal Bail: ఆంజనేయుడి చెంతకు అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో తొలి ప్రచారం నేడే

ABN , Publish Date - May 11 , 2024 | 10:32 AM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కి సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తనపై హనుమంతుడి ఆశీర్వాదం ఉందని.. జైలు నుంచి బయటకి వచ్చాక కేజ్రీ వ్యాఖ్యానించారు.

Arvind Kejriwal Bail: ఆంజనేయుడి చెంతకు అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో తొలి ప్రచారం నేడే

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కి సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తనపై హనుమంతుడి ఆశీర్వాదం ఉందని.. జైలు నుంచి బయటకి వచ్చాక కేజ్రీ వ్యాఖ్యానించారు. ఇవాళ(శనివారం) ఆయన కన్నాట్‌లోని హనుమాన్ ఆలయాన్ని ఆయన దర్శించుకోనున్నారు. 40 రోజుల జ్యుడీషియల్ కస్టడీ తర్వాత మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు(Tihar Jail) నుండి బయటకు వచ్చినందున స్వామి దర్శనానికి వెళ్లనున్నారు.

దేశంలో నియంతృత్వం పెరిగిపోయిందని దానిని అంతం చేసేందుకు ప్రజలు తనతో కలిసి రావాలని కోరారు. కేజ్రీ పర్యటన నేపథ్యంలో ఆప్ శ్రేణులు భారీగా తరలి వస్తారనే అంచనాలనడుమ సీపీ హనుమాన్ మందిర పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. “త్వరగా బయటకు వస్తానని చెప్పాను. వచ్చాను. దేశ నలుమూలల నుండి కోట్లాది మంది ఆశీర్వాదాలు నాపై ఉన్నాయి. ఇప్పుడు మీ అందరితో కలిసి ఉన్నందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు”అని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ అన్నారు.


రోడ్ షోలు..

కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి దక్షిణ ఢిల్లీలో ఇవాళ రెండు రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మెహ్రౌలీ, కృష్ణ నగర్ ప్రాంతాల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య రోడ్‌షో ప్రారంభమవుతుంది.

సంబరాలతో స్వాగతం..

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత.. కేజ్రీవాల్‌ జైలు నుంచి బయటకొచ్చారు. ఆ సమయానికే కేజ్రీ భార్య సునీత, కుమార్తె హర్షిత, ఆప్‌ నేత, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఢిల్లీ మంత్రులు ఆతిషీ, సౌరభ్‌ భరద్వాజ్‌ తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఆప్‌ నేతలు, కార్యకర్తలు సైతం జైలు బయట పెద్దసంఖ్యలో గుమిగూడారు.


Jammu Kashmir: మతసామరస్యాన్ని చాటారు.. ఆలయం కోసం ముస్లింల భూదానం


నీలి, పసుపు రంగు జెండాలు పట్టుకుని.. ‘జైల్‌ కే తాలే టూట్‌గయే.. కేజ్రీవాల్‌ జీ ఛూట్‌ గయే (జైలు తాళాలు బద్దలయ్యాయి-కేజ్రీవాల్‌ బయటికొచ్చారు) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ.. డోళ్లు వాయిస్తూ.. పూల వర్షం కురిపిస్తూ.. సంబరాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్‌.. ‘‘నియంతృత్వానికి వ్యతిరేకంగా నేను శాయశక్తులా పోరాడుతున్నాను. కానీ, 140 కోట్ల మంది ప్రజలూ ఈ పోరాటంలో నాతో కలిసి రావాలి’’ అన్నారు.

For Latest News and National News click here

Updated Date - May 11 , 2024 | 10:32 AM