Chinarajappa: కొందరు అధికారులకు జగన్ వాసన ఇంకా పోలేదు
ABN , Publish Date - Mar 25 , 2024 | 12:56 PM
Andhrapradesh: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ కొందరు అధికారులకు ముఖ్యమంత్రి జగన్ వాసన ఇంకా పోలేదని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యలు చేశారు. సోమవారం పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో చిన రాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పక్కాగా పనిచేస్తున్న క్షేత్ర స్థాయిలో పనిచేసే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
కాకినాడ, మార్చి 25: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ కొందరు అధికారులకు ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) వాసన ఇంకా పోలేదని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి నిమ్మకాయల చినరాజప్ప (TDP Leader Nimmakayala Chinnarajappa) వ్యాఖ్యలు చేశారు. సోమవారం పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో (Election Campaign) చిన రాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పక్కాగా పనిచేస్తున్న క్షేత్ర స్థాయిలో పనిచేసే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
EC: ఏపీ రాష్ట్ర అధికారుల తీరుపై ఈసీ విస్మయం..
ఇటీవల కొందరు అధికారులపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలే ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు విశాఖను డ్రగ్స్, గంజాయి కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ మాఫియా గుట్టు కూడా బయట పడిందన్నారు.ర డ్రగ్స్ వ్యవహారాన్ని వైసీపీ నేతలు తమపై రుద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలు అసత్యాలు నమ్మే పరిస్థితిలో లేరని చినరాజప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Janasena: ‘విజయవాడ వెస్ట్‌లో నేనే లోకల్’.. పోతిన నిరాహార దీక్ష
Kerala: వయనాడ్ నుంచి రాహుల్‌తో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...