TDP MLA Candidates: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. గంటా పోటీ ఎక్కడ్నుంచంటే..?
ABN , Publish Date - Mar 29 , 2024 | 02:01 PM
TDP MLA Candidates: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను (TDP MLA Candidates) ప్రకటించగా.. తాజాగా పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇప్పటి వరకూ ఉన్న సీనియర్లు, నియోజకవర్గాల మార్పులు, చేర్పులు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను అభ్యర్థులుగా హైకమాండ్ ప్రకటించడం జరిగింది.
దేవినేని ఉమాకు చంద్రబాబు కీలక బాధ్యతలు
9 మంది అభ్యర్థులు వీరే..
అటు ఇటు మార్పులు..!
మొదట్నుంచీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును.. చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే.. భీమిలి నుంచే పోటీ చేస్తానని గంటా.. లేదు చీపురుపల్లి నుంచే పోటీచేయాలని చంద్రబాబు ఇలా సుమారు రెండు వారాలు పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. దీంతో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే.. చివరికి గంటా అనుకున్న, కోరుకున్న నియోజకవర్గం భీమిలీని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రమణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది టీడీపీ అధిష్టానం. చూశారుగా.. కాస్త ఆలస్యమైనా అభ్యర్థుల విషయంలో మాత్రం టీడీపీ అదరగొట్టేసిందిగా అని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి!.
తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి