Share News

CM Chandrababu: ఆ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Nov 10 , 2024 | 06:15 PM

నామినేటెడ్ పోస్టుల్లో వైసీపీ హయాంలో వేధింపులకు గురైన పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువతకు అవకాశం కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే సమర్థత నిరూపించుకున్న బూత్ స్థాయి కార్యకర్తలకూ రాష్ట్రస్థాయి పదవులు కేటాయించినట్లు ఆయన చెప్పారు.

CM Chandrababu: ఆ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు..
AP CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పొందిన 59 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని ఆయన వారికి సూచించారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చినట్లు తెలిపారు.


వైసీపీ హయాంలో వేధింపులకు గురైన పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువతకు అవకాశం కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే సమర్థత నిరూపించుకున్న బూత్ స్థాయి కార్యకర్తలకూ రాష్ట్రస్థాయి పదవులు కేటాయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దాదాపు 30 వేల దరఖాస్తులు పరిశీలించి తగిన వ్యక్తులకు తగిన విధంగా పదవులు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎంపికలు జరిగాయని సీఎం వెల్లడించారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కూటమి పార్టీలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం చంద్రబాబు వారికి సూచించారు.


కాగా, రెండో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాను ఏపీ ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. పార్టీ కోసం కష్టపడిన వారికి, వైసీపీ హయాంలో ఇబ్బందులకు గురైన వారికి సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని పదవులు కేయించారు. తొలి విడతలో 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లతోపాటు సభ్యులు, డైరెక్టర్లు కలిపి మొత్తం 99 మందికి అవకాశం కల్పించగా.. రెండో విడతల 59 మందికి పదవులు లభించాయి.


అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించడంపై సీఎం చంద్రబాబుకు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ మైదానంలో ఉన్న చెత్తని శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నానని, ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయడంతో నేడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి నియమించారని పట్టాభి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టణాన్ని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే కీలకమైన బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Srisailam: శ్రీశైలం ఆలయానికి వివాదాల అఘోరీ.. విషయం ఏంటంటే..

Pawan Kalyan: ఆ విషయంలో చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పిన పవన్ కల్యాణ్..

Pawan Kalyan: షర్మిల భద్రతపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Nov 10 , 2024 | 06:25 PM