GV Anjaneyulu: జగన్‌వి శవ రాజకీయాలు.. జీవీ ఆంజనేయులు విసుర్లు
ABN , Publish Date - Jul 19 , 2024 | 07:51 PM
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వ్యాఖ్యలపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి రాజకీయ విమర్శలు చేయటం కోసమే వినుకొండ వచ్చారని అన్నారు.
పల్నాడు జిల్లా: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వ్యాఖ్యలపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి రాజకీయ విమర్శలు చేయటం కోసమే వినుకొండ వచ్చారని అన్నారు. శవ రాజకీయాలు చేసేందుకు వచ్చిన జగన్ వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రషీద్, జిలాని ఇద్దరినీ వైసీపీలో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపెంచి పోషించిన వ్యక్తులేనని స్పష్టం చేశారు.
వారి నేర ప్రవృత్తిని తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం సరికాదని అన్నారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఎప్పుడూ ఢిల్లీలో ధర్నా చేయలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్ర ప్రాజెక్టులు నిధుల కోసం ఢిల్లీకి ఎంపీలను తీసుకెళ్లి ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కనీసం బాబాయ్ హత్య కేసు విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని కేంద్రాన్ని అడగలేదని నిలదీశారు. అలాంటి జగన్‌కు ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ధర్నా చేసే హక్కు ఉంటుందా అని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఐదేళ్లు దాడులు పెరిగాయి: మల్లికార్జునరావు
మాజీ సీఎం జగన్‌కు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఇంకా బుద్ధి రాలేదని వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు (Makkena Mallikarjuna Rao) విమర్శించారు. వినుకొండ వచ్చి తప్పుడు మాటలు మాట్లాడారని ధ్వజమెత్తారు. జగన్ వెనుక ఉన్న వ్యక్తి పై ఎన్ని కేసులు ఉన్నాయో జగన్ తెలుసుకోవాలని చెప్పారు. జగన్ ఎన్నికల్లో ఓడిపోయన తర్వాత శాంతి భద్రతల అంశం గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐదేళ్లు దాడులు, హత్యలతో ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసింది జగన్ కాదా..? అని నిలదీశారు. రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మక్కెన మల్లికార్జునరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.