Share News

Nara Lokesh: ఆరు పథకాల గ్యారంటీకి కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Aug 15 , 2024 | 10:45 AM

దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల చాలా కార్యక్రమాలు చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా లోకేష్ హాజరయ్యారు. జిల్లా పోలీసుల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... స్వాతంత్రం కోసం గుంటూరు జిల్లా వాసులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

Nara Lokesh: ఆరు పథకాల గ్యారంటీకి కట్టుబడి ఉన్నాం
Nara Lokesh

గుంటూరు జిల్లా: దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల చాలా కార్యక్రమాలు చేసిందని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. గుంటూరు జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా లోకేష్ హాజరయ్యారు. జిల్లా పోలీసుల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... స్వాతంత్రం కోసం గుంటూరు జిల్లా వాసులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ రోజు వేడుకలు తనకు జీవితం మొత్తం గుర్తు ఉంటుందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.


దేశం అంటే భక్తి ఉండాలని సూచించారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛను సాధించారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ప్రజా సంఘాలకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు హామీలకు అనవసరమైన ఆంక్షలతో సంక్షేమ పథకాలు కట్ చేయమని వివరించారు. ఏడాదికి రూ. 250 పింఛన్ పెంచడం కాదని.. ఒకేసారి వెయ్యి రూపాయలు తమ ప్రభుత్వంలో పెంచామని గుర్తుచేశారు. చంద్రబాబు ఇచ్చిన ఆరు పథకాల గ్యారంటీకి కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.


యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ద్వేయమని అన్నారు. ఇప్పటికే డీఎస్సీ ప్రకటించామని, పేదవారికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌ని ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. రైతులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో 22,800 టన్నుల ఎరువులను రైతులకు అందించామని అన్నారు. పాడి రైతులకు రూ. 20 కోట్ల రుణాలు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.


మత్స్యకారులను కూడా ఆదుకుంటున్నాం. గుంటూరు ఛానల్ ఆధనీకరణ కోసం నిధులు విడుదల చేశాం. ఎన్టీఆర్ వైద్య సేవను పటిష్ఠంగా అమలు చేస్తాం.. తల్లికి వందనం అమలు చేస్తాం. 560 స్కూల్స్ నీ అప్గ్రేడ్ చేయనున్నాం . డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాం. పింఛన్ పంపిణీ చేశాం. రూరల్ వాటర్ మిషన్ అమలు, నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆగిపోయిన అమరావతి పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 10:52 AM