Share News

Nadendla Manohar: అక్రమార్కులను ఎవరిని వదలిపెట్టం.. మంత్రి నాదెండ్ల వార్నింగ్

ABN , Publish Date - Jun 18 , 2024 | 02:50 PM

రేషన్ సరఫరాలో అక్రమాలకు తావు లేదని.. అక్రమాలకు పాల్పడిన ఎవరిని వదలిపెట్టబోనని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వార్నింగ్ ఇచ్చారు. లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం జరిపినట్లు తెలిపారు.

Nadendla Manohar: అక్రమార్కులను ఎవరిని వదలిపెట్టం.. మంత్రి నాదెండ్ల వార్నింగ్
Nadendla Manohar

అమరావతి: రేషన్ సరఫరాలో అక్రమాలకు తావు లేదని.. అక్రమాలకు పాల్పడిన ఎవరిని వదలిపెట్టబోనని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వార్నింగ్ ఇచ్చారు. లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం జరిపినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్లలో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో తేడా కనిపించిందని అన్నారు.


ప్యాకెట్ల తూకంలో 50 నుంచి 80 గ్రాములు తక్కువగా ఉందని అన్నారు. ఈరోజు( మంగళవారం) తన కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ... ఏపీలో 253 మండల లెవల్ స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి రిపోర్టు ఇవ్వాలని అప్పుడే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 62 ఎంఎల్ఎస్ కేంద్రాల్లో తనిఖీలు పూర్తయ్యాయని అన్నారు.


ఇప్పటి వరకు 24 చోట్ల అక్రమాలు తేలాయన్నారు. బాధ్యులపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. సరకులు సరఫరా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. ఎల్లుండిలోగా అన్ని స్టాక్ పాయింట్లలో తనిఖీలు పూర్తి చేయాలని ఆదేశించామని తెలిపారు. అక్రమార్కులు అందరిపైనా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ద్వారా అందించే సరుకుల్లో దోపిడీ చేయడాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని చెప్పుకొచ్చారు.


ప్రజలంతా మార్పును కోరారని...ఆ మేరకు మార్పు తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. తాము నిజాయితీగా, చట్టప్రకారం వ్యవహారిస్తామని ఉద్ఘాటించారు. ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెట్టినా , మోసం చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ధాన్యం అమ్ముకునే రైతులకు అన్యాయం జరగదని.. పారదర్శకంగా వ్యవహరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pawan Kalyan: నాదెండ్ల ఓకే.. పవన్ ఏమంటారో..!!

TDP: జగన్‌ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 02:56 PM