Chandrababu: చంద్రబాబు ఎఫెక్ట్.. యూపీఎస్సీ నిర్ణయంతో కంగుతిన్న వైసీపీ!
ABN , Publish Date - May 30 , 2024 | 11:56 AM
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) లేఖకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) స్పందించింది. నాన్ కేడర్ ఐఏఎస్‌ల ఎంపిక ప్రక్రియను జూన్ 6నుంచి 25కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల కౌంటింగ్‌లో లబ్ధిపొందేందుకు ఇంటర్యూలు మే లోనే పూర్తి చేయాలని యూపీఎస్సీకి సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు. ఆ ప్రయత్నాలను టీడీపీ అధినేత చంద్రబాబు తిప్పికొట్టడంతో అధికార పార్టీకి కోలుకో లేని దెబ్బ తగిలినట్లయ్యింది..
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) లేఖకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) స్పందించింది. నాన్ కేడర్ ఐఏఎస్‌ల ఎంపిక ప్రక్రియను జూన్ 6నుంచి 25కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల కౌంటింగ్‌లో లబ్ధిపొందేందుకు ఇంటర్యూలు మే లోనే పూర్తి చేయాలని యూపీఎస్సీకి సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు. ఆ ప్రయత్నాలను టీడీపీ అధినేత చంద్రబాబు తిప్పికొట్టడంతో అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయ్యింది.
సీఎస్ జవహర్ రెడ్డి లేఖ, తాము సూచించిన వారినే ఎంపిక చేయించేందుకు సీఎస్ చేసిన ప్రయత్నాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బహిర్గతం చేసింది. దీనిపై స్పందించిన చంద్రబాబు యూపీఎస్సీకి లేఖ రాశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఇంటర్వ్యూలు చేయవద్దని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రక్రియ చేపట్టాలని లేఖలో తెలిపారు. దీంతో ఇంటర్వ్యూల తేదీని యూపీఎస్సీ జూన్ 25కు వాయిదా వేసింది.
ఇది కూాడా చదవండి:
AP politics: పేట్రేగిపోతున్న వైసీపీ మూకలు.. బెంబేలెత్తుతున్న ఎన్నికల అధికారులు..!
For more Andhrapradesh news and Telugu news..