Share News

Andhra Pradesh: సంచలన నిర్ణయం.. 410 మంది ఉద్యోగుల తొలగింపు..

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:26 PM

వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్‌కు రూ.1200 కోట్లు అప్పులు చేయడం సహా రూ. 900 కోట్లు బకాయిలు పెట్టిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్‌లో అక్రమంగా అర్హత లేకున్నా ఉద్యోగులను నియమించిందని జీవీరెడ్డి అన్నారు.

Andhra Pradesh: సంచలన నిర్ణయం.. 410 మంది ఉద్యోగుల తొలగింపు..

విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్‌లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏపీ ఫైబర్‌నెట్‌లో గత వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని జీవీరెడ్డి ఆరోపించారు. ఇవాళ(మంగళవారం) ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి వివాదాస్పద దర్శకుడు రాంగోల్‌వర్మకు రూ.1.15 కోట్లు అక్రమంగా చెల్లించారని ఆరోపించారు. రాంగోల్‌వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజులు సమయం ఇచ్చామని గుర్తుచేశారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్‌లో అక్రమంగా అర్హత లేకున్నా ఉద్యోగులను నియమించిందని జీవీరెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఏపీ ఫైబర్ నెట్‌లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని జీవీరెడ్డి స్పష్టం చేశారు.


gv-reddy.jpg

ఆ ప్రకారమే ఉద్యోగుల తొలగింపు: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి

న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహా తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హతలు లేకుండా ఉద్యోగులను నియమించారని గుర్తుచేశారు. కొందరు ఫైబర్ నెట్‌లో నియమితులై.. గతంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు , నేతల ఇళ్లలో పనిచేశారని చెప్పారు. వేతనాల పేరిట ఏపీ ఫైబర్ నెట్ నుంచి కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తాము కక్షతో దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదని అన్నారు. ఫైబర్ నెట్ సంస్థ దివాలా అంచుకు చేరిందని జీవీరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


ALSO READ: AP News: విజయవాడ కోర్టుకు తెలంగాణ ఏపీ ప్రజాప్రతినిధులు

వారికి లీగల్ నోటీసులు పంపిస్తాం..

వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్‌కు రూ.1200 కోట్లు అప్పులు చేయడంతో సహా రూ. 900 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. అక్రమంగా నియమితులైన ఉద్యోగులను తీయకపోతే తాము రోడ్డున పడతామన్నారు. ఎక్కువగా మాట్లాడినా, గోల చేసినా జీతాలు రికవరీ చేయాల్సి వస్తోందని... కేసులు పెట్టాల్సి వస్తోందని హెచ్చరించారు. ఉద్యోగులను నియమించిన అధికారులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని అన్నారు. జగన్ ప్రభుత్వంలో అప్పటి ఎండీ లెక్కలేని తనంగా వ్యవహరించారని ఆరోపించారు. అవసరాన్ని బట్టి ఉద్యోగులను ఇప్పుడు తీసుకుంటామని .. కేవలం ఉద్యోగాలిచ్చేందుకే అపాయింట్‌మెంట్‌లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అనర్హత ప్రకారం తీసుకున్న మరో 200 మంది ఉద్యోగుల అపాయింట్‌మెంట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు. మరో 200 మందిని కొద్ది రోజుల్లో తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని జీవీరెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Nadendla Manohar: ఆ చట్టంపై అవగాహన ఉండాలి

Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..

YCP: వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

Minister Nara Lokesh : శ్యామ్‌ బెనగల్‌ మృతికి లోకేశ్‌ సంతాపం

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 24 , 2024 | 04:22 PM