Ramakrishna: వాటిపై చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి..
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:44 PM
Andhrapradesh: విశాఖ స్టిల్ ప్లాంట్ కూడా ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోంది అని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టిల్‌కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్‌ను ప్రైవేటుపరం కాకుండా చూడండి’’ అంటూ డిమాండ్ చేశారు.
విజయవాడ, సెప్టెంబర్ 16: ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం ప్రైవేటు జపం చేస్తున్నారని విమర్శించారు. చెప్పినవి ఏం చేశారని... మసిపూసి మారేడు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
YS Viveka Murder Case:వివేకా కేసులో అవినాష్‌ను కాపాడుతున్న జగన్.. అసలు కారణం అదేనా..
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhap Steel Plant) కూడా ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. విశాఖ స్టిల్‌కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్‌ను ప్రైవేటుపరం కాకుండా చూడండి’’ అంటూ డిమాండ్ చేశారు. ఇండియాలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టీల్ పరిశ్రమ విశాఖది అని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, మెడికల్ సిట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
TG News: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా?.. ఆత్మహత్యా?
ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగుల తీరు మారటం లేదన్నారు. ఉద్యోగులు అయ్యుండి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయటం హర్షించదగ్గ విషయం కాదన్నారు. ఇప్పటికే జగన్‌కు భజన చేసిన ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు. రేపు సీపీఐ ఆధ్వర్యంలో కొల్లేరు నుంచి బుడమేరు వరకు పరిశీలించి ఎల్లుండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తామని సీపీఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Pawan Kalyan: నరసాపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారంపై పవన్ కల్యాణ్ హర్షం..
Dokka Manikya varaprasad: ఆ ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా
Read LatestAP NewsANDTelugu News