Vellampalli Srinivas: సుప్రీంకోర్టు విచారణలో వాస్తవాలు బయటకు..
ABN , Publish Date - Sep 30 , 2024 | 04:51 PM
Andhrapradesh: కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు జరిగాయని వెల్లంపల్లి అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఆ నెయ్యి ట్యాంకర్లు వాడలేదని కోర్టులో చెప్పారన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 30: టీటీడీ లడ్డూ (Tirumala Laddu) వ్యవహారానికి సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) విచారణలో వాస్తవాలు బయటకు వస్తున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Former Minister Vellampalli Srinivas) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు జరిగాయన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తరపున న్యాయవాదులు ఆ నెయ్యి ట్యాంకర్లు వాడలేదని కోర్టులో చెప్పారన్నారు. శ్రీవారి భక్తులు కల్తీ ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆవేదనగా ఉన్నారన్నారు.
Bus Tickets: బస్సు ప్రయాణీకులకు బిగ్ షాక్.. రేపటి నుంచి పెరగనున్న టికెట్ ధరలు..
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. సిట్ వేయాల్సిన అవసరం ఏంటి, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించిందన్నారు. మూడో తారీఖున జరిగే విచారణలో నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారితో రాజకీయాలు చేయవద్దని చంద్రబాబును కోరుతున్నానన్నారు. సుప్రీం విచారణ ద్వారా అనేక అనుమానాలు తొలిగాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Nagababu: డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సుప్రీంలో ఏం జరిగిందంటే..
కాగా.. తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గూ తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై సుప్రీంకోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉన్నతన్యాయస్థానం ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవుపలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ వి బాలకృష్ణన్ ధర్మాసనం ప్రశ్నించింది.
KTR: ఏపీ సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్ట్ నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్ట్ సందేహం వ్యక్తం చేసింది. అలాగే స్వామి వారి ప్రసాదం లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్‌కి ఎప్పుడు పంపారని ముకుల్ రోహాత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ బాలకృష్ణన్ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...
BT Naidu: పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం చంద్రబాబు పాలనలోనే..
Pawan Kalyan: ఆ పాటను ఎవరూ మరిచిపోలేరు.. మిథున్‌కు అభినందనలు
Read Latest AP News And Telugu News