Share News

Ramakrishna: సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ..

ABN , Publish Date - Sep 15 , 2024 | 09:13 AM

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ నమ్మినందుకు కుట్రలు పన్నుతున్నారని, ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేసి మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారన్నారు.

Ramakrishna: సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ..

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (CPI Leader) కె రామకృష్ణ (Ramakrishna) లేఖ (Letter) రాశారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ (Visakhapatnam Steel Privatization) ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ నమ్మినందుకు కుట్రలు పన్నుతున్నారని, ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేసి మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారన్నారు. లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు ఆస్తులను కారు చౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోందని, విశాఖ ఉక్కుకు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలంటూ సీఎం చంద్రబాబుకు రామకృష్ణ లేఖ రాశారు.


కాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిల పక్ష ట్రేడ్‌ యూనియనలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో విశాఖలోని నేతాజీ సర్కిల్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భం గా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పీ. శ్రీనివాసులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, సీపీఐ (ఎంఎల్‌) విశ్వనాధ్‌, ఎంఆర్‌పీఎస్‌ జాతీయ నాయకులు రామాంజనేయులు, రైతు సంఘాల జిల్లా ప్రధాన కార్య దర్శులు వంగిమళ్ల రంగారెడ్డి, బసిరెడ్డిలు మాట్లాడుతూ రూ.9 వేల కోట్ల పెట్టుబడికి 58 వేల కోట్ల డివిడెండ్‌ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇందులో భాగంగానే బ్లాస్ట్‌ ఫర్నేస్‌ రెండింటిని ఉద్దేశపూర్వకంగా మూసివేశారని, 75 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం నుంచి 30 లక్షల టన్నులకు స్టీల్‌ ఉత్పత్తి పడిపో నుందని తెలిపారు.


దీంతో అనివార్యంగా నష్టాల్లోకి విశాఖ ఉక్కును నెట్టాలని బీజేపీ మోదీ ప్రభుత్వం భావిస్తోందని, రాష్ట్ర పార్లమెంట్‌ సభ్యులు బలంపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరణ ప్రకటన చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ను డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించి తమ చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలన్నారు. విశాఖ ఉక్కును వదులుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని, అవసరమైతే మరో అంతిమ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు ఏవీ రమణ, సుబ్రమణ్యంరాజు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సుమిత్రమ్మ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన జిల్లా అధ్య క్షుడు నేలపాటి శ్రీనివాసులు, నరసింహులు, వేణుగోపాల్‌రెడ్డి, మురళి, వెంకట్రమణ, ఆకార్స్‌ యూనియన నాయకులు చంద్ర, సీపీఐ (ఎంఎల్‌) నాయకులు పూసపాటి రమణ తదితరులు పాల్గొన్నారు.


అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఆపే విధంగా ప్రధాని మోడీతో సిఎం చంద్రబాబునాయుడు మాట్లాడాలని, ఒరిస్సాలోని రాయదుర్గం నుంచి ఐరన్‌ఓర్‌ విశాఖ స్టీల్‌కు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉందని, ఇప్పటికే రెండు ప్లాంట్లు మూసివేయగా.. తాజాగా మూడో ప్లాంట్‌లో కూడా ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదకర పరిస్థితి వచ్చిందని అన్నారు. రుణ భారం చూపి ప్లాంటును అమ్మేందుకు కేంద్రం చూస్తోందని విమర్శించారు. టాటా స్టీల్‌ కన్నా ఎక్కువ విలువ కలదని, కేంద్ర రాష్ట్రాల ఖజానాకు రూ.58 వేలకోట్లు గతంలో చెల్లించిందని ఆయన అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్షమాపణలు చెప్పించుకున్న కేంద్రమంత్రి

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు స్వస్తి..

మైనర్ బాలికపై అత్యాచారం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 15 , 2024 | 09:14 AM