Sharmila: విజయవాడలో రెండు రోజుల పాటు పర్యటించనున్న షర్మిల
ABN , Publish Date - Feb 28 , 2024 | 10:14 AM
విజయవాడ: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధ, గురువారం రెండు రోజులపాటు విజయవాడలో పర్యటించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహుల అభ్యర్దులతో ఆమె ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు.

విజయవాడ: ఏపీసీసీ అధ్యక్షురాలు (APCC Chief) వైఎస్ షర్మిల (YS Sharmila) బుధ, గురువారం రెండు రోజులపాటు విజయవాడలో పర్యటించనున్నారు. అసెంబ్లీ (Assembly), పార్లమెంటు (Parliament)కు పోటీ చేసే ఆశావహుల అభ్యర్దులతో ఆమె ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేలకు పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో షర్మిల సమావేశం అవుతారు. గురువారం శ్రీకాకుళం, అరకు, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు, అసెంబ్లీకి పోటీ చేసే ఆశావహుల అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. నేరుగా ఆభ్యర్ధులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను షర్మిల తెలుసుకోనున్నారు.