Tirumala Laddu: నోటికి శూలాలు గుచ్చుకొని..
ABN , Publish Date - Sep 27 , 2024 | 12:44 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే శ్రీవారిని దర్శించుకోవాలని పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. జగన్ తిరుమల రావొద్దని హిందు సంఘాలు, కొందరు భక్తులు తేల్చి చెప్పారు.
కర్నూలు: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తిరుమల పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారానికి కారణం జగన్ అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ తీరును హిందు సంఘాలు, భక్తులు తప్పు పడుతున్నారు. క్రిస్టియన్ అయినా జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని తేల్చి చెబుతున్నారు. కర్నూలు జిల్లా కల్లూరులో కొందరు భక్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
కులమే లేదు..
‘జగన్.. తిరుమల రావొద్దని కల్లూరు శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి ఆలయం వద్ద భక్తుల నిరసన. నోటికి శూలాలు గుచ్చుకొని వినూత్న రీతిలో భక్తుల నిరసన. వారికి సంఘీభావం తెలిపిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. జగన్ హిందూ ద్రోహి, వెంకటేశ్వర స్వామిని నిలువు దోపిడీ చేసిన జగన్ దొంగ దర్శనం కోసం తిరుపతికి వస్తున్నాడు. రెడ్లకు ప్రతి ఇంటికి ఒక కుల దైవం ఉంటారు. మా ఇంటి కుల దైవం వీరభద్ర స్వామి. జగన్‌కు కులమే లేదు. కులదైవం ఎక్కడి నుంచి వస్తుంది. కడప అనేది దేవుని గడప. దుర్మార్గులు కడప పేరును మార్చారు. కడపకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టుకున్నారు. పవిత్రమైన కడప పేరును బ్రిటిష్ వారు కూడా మార్చడానికి సాహసం చేయలేదు. జగన్ తన సొంత జిల్లాకు కొవ్వు జిల్లా, గొడ్డు మాంసం జిల్లాగా అని పేరు పెట్టుకోవాలి అప్పుడు సరి పోతుంది అని’ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి:
Viral News: హమ్ దో హమారే దో డజన్‌పై క్లారిటీ
కడపగా మార్చండి
‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ జిల్లా పేరును తీసి కడప జిల్లాగా తిరిగి మార్చాలి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు జగన్ తిరుపతి వెళ్లాలనుకుంటున్నాడు. తిరుపతిని అపవిత్రం చేసిన జగన్ వెంకటేశ్వర స్వామి సన్నిధికి రావడానికి అనర్హుడు. ఏదో ఒక రోజు జగన్‌ను బట్టలు విప్పి సుంకులమ్మ కొరడాలతో జనం కొట్టడం ఖాయం. ఇందుకు మించిన ప్రాయశ్చిత్తం జగన్‌కు లేదు అని’ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి:
Viral News: హమ్ దో హమారే దో డజన్‌పై క్లారిటీ
ED Raids: పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారుల సోదాలు
KTR: హైడ్రా టార్గెట్‌గా కేటీఆర్ ఘాటు విమర్శలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.