Share News

నేడే ఒంగోలులో మాక్‌ పోలింగ్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

ABN , Publish Date - Aug 19 , 2024 | 10:55 AM

Andhrapradesh: ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై ఈరోజు (సోమవారం) నుంచి అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ జరుగనుంది. రోజుకు మూడు ఈవీఎంలు చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలులో మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో అనగా... 6,26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు.

 నేడే ఒంగోలులో మాక్‌ పోలింగ్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
Mock polling

ప్రకాశం, ఆగస్టు 19: ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై (EVMs) ఈరోజు (సోమవారం) నుంచి ఈసీ (Election Commission) అధికారులు మాక్ పోలింగ్ (Mock polling) నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు మాక్ పోలింగ్ జరుగనుంది. రోజుకు మూడు ఈవీఎంలు చొప్పున అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఒంగోలులో మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో అనగా... 6,26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఈసీ అధికారులు పరిశీలించనున్నారు. నేటి నుంచి ఈనెల 24 వరకు ఈ ప్రక్రియ సాగనుంది. ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆరు రోజుల పాటు మాక్ పోలింగ్‌ను అధికారులు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో జరుగనుంది.

Minister Komati Reddy: అనాథ బాలికకు అండగా మంత్రి కోమటి రెడ్డి


కాగా.. ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ (Former Minister Balineni Srinivas)... 12 పోలింగ్ కేంద్రాల్లో వినియోగించిన ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. బాలినేని వినతితో... టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మాక్ పోలింగ్, రీ చెకింగ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాలను వీవీ ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ హైకోర్టును మాజీ మంత్రి ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ఇవాళ (సోమవారం) ఉదయం విచారణ జరపనుంది. హైకోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఉన్నతన్యాయస్థానం తీర్పు వచ్చే వరకు కూడా టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఈసీ కొనసాగించనుంది.

CM Chandrababu: తెలుగుగింటి ఆడపడుచులకు సీఎం చంద్రబాబు రాఖీ శుభాకాంక్షలు


కాగా.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలులో నియోజకవర్గం నుంచి 26 మంది పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ విజయం సాధించారు. 34060 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఓటింగ్ సరళి, ఈవీఎంలపై తనకు అనుమానాలు ఉన్నాయని వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ ఈసీని ఆశ్రయించారు. 12 కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహణ కోసం రూ.5.66 లక్షల ఫీజును బాలినేని చెల్లించారు. దీంతో ఈవీఎంల పరిశీలనకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఈ మాక్‌పోలింగ్‌లో ఈవీఎంల తయారీ ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.


ఇవి కూడా చదవండి..

Gandipet Lake: బడా భవనాలపైకి బుల్డోజర్‌..

Raksha Bandhan: ఈ రాఖీ వెరీ స్పెషల్ గురూ.. దేశ, విదేశాల్లో భారీ డిమాండ్..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 11:03 AM