Share News

AP Politics: బయటపడుతున్న వైసీపీ దాష్టికాలు, దారుణాలు..

ABN , Publish Date - Jun 23 , 2024 | 12:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రభుత్వం మారడంతో వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో జరిగిన దాష్టికాలు, దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ(TDP) సానుభూతిపరులపై అక్రమంగా కేసులు పెట్టి, పోలీసులతో చిత్రహింసలకు గురి చేయించిన వైనం వెలుగులోకి వచ్చింది.

AP Politics: బయటపడుతున్న వైసీపీ దాష్టికాలు, దారుణాలు..
YS Jagan

విజయవాడ, జూన్ 23: ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ప్రభుత్వం మారడంతో వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో జరిగిన దాష్టికాలు, దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ(TDP) సానుభూతిపరులపై అక్రమంగా కేసులు పెట్టి, పోలీసులతో చిత్రహింసలకు గురి చేయించిన వైనం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామపురం గ్రామస్తులు తమ గోడు వెల్లబోసుకునేందుక ముఖ్యమంత్రిని కలిసేందుకు విజయవాడ వచ్చారు. రామాపురం గ్రామానికి చెందిన వైసీపీ ప్రభుత్వ బాధితులు సీఎం, ఇతర మంత్రులను కలిసేందుకు ఆదివారం విజయవాడకు వచ్చారు. తమపై అన్యాయంగా కేసులు పెట్టి వేధించారని వాపోయారు.


తమపై అన్యాయంగా పెట్టిన కేసులను తొలగించాలని.. దాష్టికాలకు పాల్పడిన పోలీసులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను విజ్ఞప్తి చేస్తున్నారు రామాపురం గ్రామస్తులు. టీడీపీకి అనుకూలంగా ఉన్నామనే గత ప్రభుత్వం తమపై కక్ష కట్టిందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టించారని వాపోయారు రామాపురం గ్రామస్తులుk. గ్రామంలో ఏకంగా 230 మందిపై 18 కేసులు నమోదు చేసి చిత్ర హింసలు పెట్టారని చెప్పారు.


ఈ వ్యవహారంలో చీరాల రూరల్ సీఐ మల్లిఖార్జునరావు ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు రామాపురం గ్రామస్తులు. సివిల్ డ్రెస్‌లో వచ్చి మరీ ఆడవారిని కూడా కొట్టేవాడని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో తమ కష్టం చెప్పుకునేందుకు వచ్చామన్నారు. తమ జీవితాలను నాశనం చేసిన అధికారులు, వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రామాపురం గ్రామస్తులు కోరారు. ఇద్దరు అక్కా చెల్లెళ్ల మధ్య జరిగిన ఘర్షణను అడ్డం పెట్టుకుని 230 మందిని కేసుల్లో ఇరికించారని.. ఎనిమిది నెలల గర్భవతిని కూడా చితకబాదారని వాపోయారు. తమపై అక్రమంగా పెట్టిన కేసులను పూర్తిగా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం మత్తులో మృగంలా వ్యవహిరించిన సీఐ మల్లిఖార్జున రావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 23 , 2024 | 12:14 PM