RK Roja: షర్మిలపై మంత్రి రోజా సంచలన కామెంట్స్
ABN , Publish Date - Feb 09 , 2024 | 01:01 PM
విశాఖ: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ ఒక సారి గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
విశాఖ: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ ఒక సారి గమనించాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపి ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం విశాఖ రైల్వే గ్రౌండ్‌లో ఆడుదాం - ఆంధ్రరాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘షర్మిలకు సలహా ఇస్తున్నాను... తెలంగాణాలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా.. రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి మనకి రావాల్సిన రూ. 6 వేల కోట్లు తీసుకురండి’’ అని సూచించారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హయాంలో ఏపీకి రావాల్సిన రూ. లక్ష 80 కోట్ల ఆస్తులు రాబట్టాలని షర్మిలకు మంత్రి రోజా సూచించారు. ఇప్పుడు రాష్ట్రంలో టూర్‌లు పెట్టి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పిన షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం చేశారో చెప్పాలన్నారు. ఏపీలో ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారో ఆమె తెలపాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసే వాళ్ళని చెప్పి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్‌లో మళ్ళీ జాయిన్ అయ్యారో షర్మిల చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు.