Palla Srinivasa Rao: పుష్పా-2 బెనిఫిట్ షోపై పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Dec 22 , 2024 | 02:01 PM
సినిమా విడుదలైనప్పుడు హీరోలు వస్తే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో హీరోలు వెళ్ళకపోవడమే మంచిదని ఏపీ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా చూసుకోవలసిన అవసరం ఉందన్నారు.
విశాఖ: పాన్ ఇండియా స్టార్ (Pan India Star) అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పుష్పా-2 (Pushpa-2) బెనిఫిట్ షో (Benefit Show) పై ఏపీ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు (AP TDP Chief) పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) కీలక వ్యాఖ్యలు (Key Comments) చేశారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. బెనిఫిట్ షోలు వెయ్యకూడదు అనే దానికి తాను వ్యతిరేకమని, సినిమా పైరసీ పెరిగిపోతుందని, అందుచేత బెనిఫిట్ షోలు వేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పుష్పా-1 హిట్ అయిందని.. అలాగే పుష్పా-2 కూడా హిట్ అవుతుందనే ఆలోచన అందరిలో ఉందన్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు కూడా ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. థియేటర్ల దగ్గరకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి ఏర్పాట్లు చేయాలన్నారు. దుర్ఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత అటు సినిమా వాళ్ల మీద.. ఇటు ప్రభుత్వంపై కూడా ఉందని, ఒకరు మీద మరొకరు ఆరోపణలు చేసుకోకుండా.. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
ఆ సమయంలో హీరోలు వెళ్లకపోవడమే మంచిది..
సినిమా విడుదలైనప్పుడు హీరోలు వస్తే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో హీరోలు వెళ్ళకపోవడమే మంచిదని పల్లా శ్రీనివాసరావు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా చూసుకోవలసిన అవసరం ఉందన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కమిటీ వేశామని.. ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సినిమా రంగంపై.. ఏపీలో సినిమా ఇండస్ట్రీపై.. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఒక మంచి స్టేట్‌మెంట్ ఇచ్చారని అన్నారు. సినిమా రంగం ఏపీలో కూడా బాగా అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో కూడా సినిమా రంగం అభివృద్ధి జరిగితే ఎంతో మంది కళాకారులకు ఉపాధి దొరుకుతుందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏ సీఎం చేయని ద్రోహం జగన్ చేశారు: మంత్రి నిమ్మల
చెప్పులు కుట్టే వ్యక్తిని సన్మానించిన పవన్
ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదు: పురందేశ్వరి
కుప్పంలో నాల్గవ రోజు నారా భువనేశ్వరి పర్యటన
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News