Share News

YS Sharmila: ఏలేరు ఆధునికీకరణను జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు

ABN , Publish Date - Sep 12 , 2024 | 01:40 PM

Telangana: ఏలేరు వరదతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏలేరు ఆధునికరణ జరగకపోవడం, పూడిక తియ్యకపోవడం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు. రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోయారన్నారు.

YS Sharmila: ఏలేరు ఆధునికీకరణను జరగకపోవడం వల్లే ఇంతటి విపత్తు
APCC Chief YS Sharmila

కాకినాడ, సెప్టెంబర్ 12: ఏలేరు వరదతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి (APCC Chief YS Sharmila) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏలేరు ఆధునికరణ జరగకపోవడం, పూడిక తియ్యకపోవడం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు. రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోయారన్నారు. ప్రతి ఎకరాకు 30వేల చొప్పున రైతు ఖర్చు పెట్టాడని తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

TG Govt: మెడికల్ అడ్మిషన్లకు స్థానికత‌పై సుప్రీంకు తెలంగాణ సర్కార్


దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయంలో ఏలేరు ఆధునీకరణకు నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభు త్వాలు ఏలేరు ఆధునీకరణను విస్మరించాయని విమర్శించారు. జగన్ ఏలేరు ఆధునికరణను చేయకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...
RG Kar Medical College: ప్రొ. సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు

Godavari: ఉదయం 7 నుంచి స్వల్పంగా తగ్గిన గోదావరి వరద

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 12 , 2024 | 01:41 PM