Godavari: పెరుగుతున్న గోదావరి వరద... పలు గ్రామాలు జలదిగ్బంధం
ABN , Publish Date - Sep 11 , 2024 | 09:30 AM
Andhrapradesh: ఏపీలో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద పెరుగుతోంది. వేలేరుపాడు మండలం రుద్రంకోటతో పాటు పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.
ఏలూరు, సెప్టెంబర్ 11: ఏపీలో గోదావరి (Godavari) మహోగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద పెరుగుతోంది. వేలేరుపాడు మండలం రుద్రంకోటతో పాటు పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ముంపు వాసులను దాచారంలోని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. గోదావరి, శబరి నదులకు వరద పోటు ఉండటంతో గంట గంటకు పెరుగుతున్న వరదతో ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు గోదావరిలో కలుస్తోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు పెరిగింది. బ్యారేజ్‌కు చెందిన 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి 13.27 లక్షల క్యూసెక్కులు వరద నీరు దిగువకు విడుదల చేయడం జరుగుతోంది. పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. గోదావరి వరద నేపథ్యంలో తూర్పుగోదావరి, అల్లూరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు.
Hyderabad: ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నిమజ్జనం.. ఆరోజు మధ్యాహ్నంలోపే
అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో శబరి, సీలేరు ఉపనదులతో పాటు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం-కూనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలలుకు సెలవులు ప్రకటించారు. మూడు రోజుల నుంచి ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరంలో శబరి, గోదావరి సంగమం వద్ద ఉన్న వంతెనను వరద నీరు తాకింది. సోకిలేరు, చంద్రవంక, చీకటివాగు, కుయుగూరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలంలో 22 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వీఆర్ పురం మండలం మండలంలోని ప్రధాన రహదారులపై ప్రవహిస్తున్న వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారు.
ఇవి కూడా చదవండి..
AP News: నేడు, రేపు ఏపీలో వరద ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
YS Jagan: ఇవాళ గుంటూరు జిల్లా జైలుకు వైఎస్ జగన్.. ఎందుకంటే?
Read Latest AP News And Telugu news