Share News

Stock Market: 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్‌.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Dec 31 , 2024 | 10:07 AM

భారత స్టాక్ మార్కెట్లు 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్‌లో తీవ్ర పతనం దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా సెన్సెక్స్ 508 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోని షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. అయితే లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి.

Stock Market: 2024 సంవత్సరాంతపు ట్రేడింగ్ సెషన్‌.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
Stock Markets Losses december 31st

భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) 2024 సంవత్సరం చివరి రోజైన నేడు (డిసెంబర్ 31న) ట్రేడింగ్ సెషన్‌లో భారీ పతనంతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు మంగళవారం మొత్తం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ దాదాపు 508 పాయింట్లు బలహీనపడింది. నిఫ్టీ 114 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.

మరోవైపు బ్యాంక్ నిఫ్టీలో 155 పాయింట్ల క్షీణత కనిపించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 474 పాయింట్లు నష్టపోయింది. ప్రధానంగా ఐటీ షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రైవేట్ బ్యాంక్ రంగం కూడా బలహీనంగా ఉంది. అయితే లోహాలు స్వల్ప పెరుగుదలతో తెరవబడ్డాయి. మార్కెట్‌కు ప్రభుత్వ షేర్ల నుంచి మద్దతు లభించింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.


టాప్ 5 స్టాక్స్

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ఫోసిస్, TCS, టెక్ మహీంద్రా, విప్రో, అదానీ ఎంటర్‌ప్రైస్‌ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, ONGC, భారత్ ఎలెక్ట్రిక్, కోల్ ఇండియా, SBI, JSW స్టీల్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. గత త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల బలహీనమైన త్రైమాసిక ఫలితాలు, నిరంతర విదేశీ అమ్మకాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. మొత్తం 13 ప్రధాన రంగాలు క్షీణతను నమోదు చేశాయి. IT 0.8% క్షీణతతో టాప్ సెక్టార్‌గా ఉంది. దేశీయంగా ఫోకస్ చేసిన స్మాల్‌క్యాప్‌లు, మిడ్‌క్యాప్‌లు వరుసగా 0.25%, 0.5% క్షీణించాయి.


స్టాక్ మార్కెట్ పతనానికి కారణం?

ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలతో సహా ఆసియా మార్కెట్ల పతనం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించింది. US (U.S. ట్రెజరీ)లో బాండ్ ఈల్డ్స్ పెరగడం అభివృద్ధి చెందుతున్న స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో మార్కెట్లలో క్షీణత కనిపిస్తోంది. ఈ కారణంగా విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ల నుంచి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) సోమవారం రూ. 240.45 బిలియన్ల ($2.8 మిలియన్లు) విలువైన షేర్లను విక్రయించారు. వరుసగా 10వ ట్రేడింగ్ సెషన్‌లో కూడా నికర అమ్మకందారులు పెరిగారు. దీనికి విరుద్ధంగా, దేశీయ పెట్టుబడిదారులు వరుసగా 9వ ట్రేడింగ్ సెషన్‌లో నికర కొనుగోలుదారులుగా మిగిలిపోయారు.


సోమవారం మార్కెట్ ఎలా ఉంది?

సోమవారం కూడా భారత బెంచ్‌మార్క్ సూచీలు పడిపోయాయి. ఆ క్రమంలో 30 షేర్ల BSE సెన్సెక్స్ సోమవారం (డిసెంబర్ 30న) 450.94 పాయింట్ల పతనంతో 78,248.13 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా 168.50 పాయింట్లు క్షీణతతో 23,644.90 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు నిఫ్టీ, సెన్సెక్స్‌లు వరుసగా 8.8%, 8.3% చొప్పున పెరిగాయి. ఇది 2023లో దాదాపు 20% జంప్ కంటే చాలా తక్కువ కావడం విశేషం.


ఇవి కూడా చదవండి:

Major Changes: 2025లో బిగ్ ఛేంజేస్.. తెలుసుకోకుంటే మీకే నష్టం..


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 31 , 2024 | 10:18 AM