Stock Market: భారీగా పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్లు.. కోలుకుంటున్న గౌతమ్ అదానీ షేర్లు..
ABN , Publish Date - Nov 22 , 2024 | 02:47 PM
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1,700 పాయింట్లకు పైగా పెరిగి 78,925కు ఎగబాకింది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా లాభంతో 23,875 పాయింట్ల వద్ద దూసుకెళ్తోంది.
బిజినెస్ డెస్క్: స్టాక్ మార్కెట్లు భారీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1,700 పాయింట్లకు పైగా పెరిగి 78,925కు ఎగబాకింది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా లాభంతో 23,875 పాయింట్ల వద్ద దూసుకెళ్తోంది. అయితే ఇవాళ(శుక్రవారం) ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 338 పాయింట్ల లాభంతో 77,494.08 వద్ద ట్రేడయ్యింది. నిన్న (గురువారం) నాడు సెన్సెక్స్ 400 పాయింట్లు పతనం కాగా నేడు పుంజుకుంటోంది. గురువారం రోజు భారీగా పడిపోయిన దేశీయ మార్కెట్లు ఇవాళ పుంజుకుంటున్నాయి. దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన లంచం ఆరోపణల నేపథ్యంలో నిన్న మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో అదాన్నీ గ్రూప్ షేర్లతోపాటు, మదుపరులకు చెందిన రూ.6లక్షల కోట్ల సందప నిన్న ఒక్కరోజే ఆవిరైపోయింది. అయితే ఇవాళ అంతే వేగంగా స్టాక్ మార్కెట్ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే నిన్న అంతలా పడిపోయిన స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి అంతర్జాతీయ మార్కెట్లు మంచి ఊపు మీద ఉండడమే కారణం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నవంబర్ నెలకు సంబంధించి అమెరికాకు చెందిన నిరుద్యోగ డేటా వెలువడింది. దీంతో ఒక్కసారిగా ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. నవంబర్ నెలలో అమెరికా దేశం ఉద్యోగాల్లో మెరుగైన వృద్ధి సాధించడమే దీనికి కారణం. కొంతకాలంగా వరస నష్టాలతో ప్రధాన కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. అయితే పడిపోయిన ధరల వద్ద ఆయా కంపెనీ షేర్లను మదుపరులు కొనేందుకు ఆసక్తి చూపడంతో బ్లూచిప్ స్టాక్స్ డిమాండ్ పెరిగింది. దీనికి ఐసీఐసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ వంటి షేర్లు సపోర్ట్‌గా నిలిచాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్‌లోనూ కొనుగోళ్లకు మద్దతు కనిపిస్తోంది. దీంతో అమెరికాతోపాటు భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు పుంజుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
Adani Group: అమెరికాలో లంచం ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..
Read More Business News and Latest Telugu News