Gold Rates: మహిళా మణులకు శుభవార్త.. ఈ రోజు బంగారం ధర ఎలా ఉందంటే..
ABN , Publish Date - Dec 04 , 2024 | 07:14 AM
కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు (04-12-2024) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు కేవలం ఒక రూపాయి మాత్రమే పెరిగి మహిళా మణులకు ఊరట కలిగించింది.
బిజినెస్ డెస్క్: దసరా, దీపావళి, దంతేరాస్ పండగల వేళ బంగారం ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పండగల వేళ జీవితకాల గరిష్ఠానికి పసిడి, వెండి రేట్లు పెరిగాయి. అయితే కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా వీటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు (04-12-2024) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు కేవలం ఒక రూపాయి మాత్రమే పెరిగి మహిళా మణులకు ఊరట కలిగించింది. 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.77,780 ఉండగా, నేడు రూ.10 పెరిగి రూ.77,790గా ఉంది. నిన్న వెండి కిలో ధర రూ.99,500 ఉండగా.. నేడు కిలోకు రూ.100 తగ్గి రూ.99,400కు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.77,940గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.90,900కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 71,310 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 77,790గా ఉంది. అలాగే కిలో వెండి రూ. 100 తగ్గి రూ. 99,400గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు 10 గ్రాములకు (22 క్యారెట్, 24 క్యారెట్)
హైదరాబాద్- రూ. 71,310, రూ. 77,790,
విజయవాడ- రూ. 71,310, రూ. 77,790,
ఢిల్లీ- రూ.71,460 , రూ.77,940
ముంబై- రూ. 71,310, రూ.77,790
కోల్‌కతా- రూ. 71,310, రూ. 77,790
చెన్నై- రూ. 71,310, రూ. 77,790
పుణె- రూ. 71,310, రూ. 77,790
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
పుణె- రూ.90,900
హైదరాబాద్- రూ. 99,400
విజయవాడ- రూ. 99,400
ఢిల్లీ రూ.90,900
చెన్నై- రూ. 99,400
కోల్‌కతా- రూ. 90,900
ముంబై- రూ.90,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.